Share News

CM Revanth: యువత దేశానికి మార్గనిర్దేశకులుగా మారాలి

ABN , Publish Date - Aug 12 , 2024 | 12:04 PM

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్ధేశకులు కావాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.

CM Revanth: యువత దేశానికి మార్గనిర్దేశకులుగా మారాలి
CM Revanth Reddy

హైదరాబాద్: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ ట్విట్టర్(X)లో ట్వీట్ చేశారు. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్ధేశకులు కావాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు. తెలంగాణ యువత రాణించేలా ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ తీసుకుందని సీఎం తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, పెడదారులను నియంత్రిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం తదితర నిర్ణయాలు అందులో భాగమే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


పెట్టుబడుల కోసం సౌత్ కొరియాకు రేవంత్ టీం..

మరోవైపు.. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. పది రోజుల ప్రణాళికలో భాగంగా ఏడు రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు.


రేవంత్‌తో పాటు సౌత్ కొరియాకు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సైతం వెళ్లారు. అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసినట్లు రేవంత్ పేర్కొన్నారు. అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు.

Updated Date - Aug 12 , 2024 | 12:15 PM