CM Revanth Reddy: తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు
ABN , Publish Date - Oct 19 , 2024 | 02:40 PM
బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలాంటివారి భరతం పడుతుందని హెచ్చరించారు. హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలరా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో కేసీఆర్ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా? అని నిలదీశారు. ప్రధాన మంత్రి పదవినే త్యాగం చేసిన చరిత్ర సోనియా గాంధీది అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర అని ఆరోపించారు. ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బుల్డోజర్లను కూడా సిద్ధం చేశా.. ఎవరు అడ్డం వస్తారో రావాలని హెచ్చరించారు. వాళ్ల ఫామ్ హౌస్‌లపైకి బుల్డోజర్లు వస్తాయనే భయంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
తన ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజులను హరీశ్‌రావు మర్చిపోయారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీరు పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా అని ప్రశ్నించారు. వాళ్ల తాపత్రయమంతా ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికేనని అన్నారు. మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: గబ్బు రేపుతున్న హైదరాబాద్ పబ్బులు..
TG News: ముగ్గురు యువకుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చూస్తే..
TG News: ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో సహించలేని ఓ యువకుడు ఏం చేశాడంటే