Share News

CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:28 PM

పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) దృష్టి సారించారు. కాసేపటి క్రితమే పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRD‌లో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు.

CM Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections ) పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) దృష్టి సారించారు. కాసేపటి క్రితమే పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRD‌లో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు. మొదటగా ఆదిలాబాద్ పార్లమెంట్‌ స్థానంపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల , మల్కాజిగిరి, మహాబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నేడు ఉమ్మడి ఐదు జిల్లాలకు చెందిన కీలక నేతలతో చర్చిస్తున్నారు. మంగళవారం( రేపు) మిగతా ఐదు జిల్లాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2024 | 05:59 PM