Share News

Vishnukumar Raju: జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 19 , 2024 | 02:03 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బిజేపిలోకి వస్తే తీసుకోమని స్పష్టం చేశారు. బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

Vishnukumar Raju: జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
BJP MLA Vishnukumar Raju

విశాఖపట్నం, ఆగస్టు 19: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు (BJP MLA Vishnukumar Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బిజేపిలోకి వస్తే తీసుకోమని స్పష్టం చేశారు. బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. వైసీపీని తమ పార్టీలో విలీనం చేసుకొని తమను కూడా నాశనం అయిపోమంటారా? అని ప్రశ్నించారు.

Seethakka: ఆడబిడ్డలను ఎగరనిద్దాం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు



లక్షల కోట్లు దాచుకున్న డబ్బులు బెంగళూరు ప్యాలెస్‌లో పెట్టారు.. అందుకే తరుచు జగన్ అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ‘‘బెంగళూరు ప్యాలెస్ పై రైడ్ చేయాలి కదా? ..సిబిఐ, సిఐడి, ఏసిబి ఏమి చేస్తోంది? జగన్ ప్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చెక్ చేయాలి . జగన్ పార్టీ 151 స్థానాల నుంచి...11 స్థానాలకు దిగజారిపోతారని ఎవరైనా ఊహించారా?.. అంటూ వ్యాఖ్యలు చేశారు. 11 స్థానాలు గెలుచుకున్న వైసీపీకి ప్రతి పక్ష హోదా ఇస్తే... తమకు కూడా ఒక హోదా కావాలన్నారు. కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కలలు కంటున్నారని.. కళ్లు మూసుకుంటే కోమాలోకి వెళ్లిపోతారంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఐదు సీట్లు కూడా రావని... రాసి పెట్టుకోవాలని అన్నారు.

National: చంపయీ సోరెన్ కషాయ కండువా కప్పుకుంటారా.. షిండే పాత్ర పోషిస్తారా..!


బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై..

బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై కూడా మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి ఇబ్బందికర పరిస్థితికి వెళ్లిపోయిందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడితే బాగుటుందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Bandi Sanjay: రేవంత్ బీజేపీలోకి వస్తే.. కేసీఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్తారా..?: బండి సంజయ్

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 02:11 PM