Share News

CM Revanth Reddy: లాంగ్వేజ్ వేరు నాలెడ్జ్ వేరు కేటీఆర్.. తెలుసుకో: రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Aug 02 , 2024 | 09:02 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ఆర్ మనిహారంగా తీర్చిదిద్దారని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు. ఓఆర్ రోడ్డు లోపల నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హైడ్రాను సిద్ధం చేస్తు్న్నట్లు ఆయన ప్రకటించారు.

CM Revanth Reddy: లాంగ్వేజ్ వేరు నాలెడ్జ్ వేరు కేటీఆర్.. తెలుసుకో: రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(AP CM Chandrababu), మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ఆర్ మనిహారంగా తీర్చిదిద్దారని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొనియాడారు. ఓఆర్ఆర్ లోపల నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు హైడ్రాను సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


హేళన చేయకు కేటీఆర్..

లాంగ్వేజ్, నాలెడ్జ్ వేర్వరని కేటీఆర్ తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు. అవతలి వారిని అవహేళన చేయకూడదనే అవగాహన ఆయన ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో గజ్వేల్‌కు ఇచ్చిన నీరు శ్రీపాద ఎల్లంపల్లి పైప్ లైన్‌కు బొక్కపెట్టి తీసుకెళ్లినట్లు సీఎం ఆరోపించారు. దానం నాగేందర్ సభలో మాట్లాడితే తప్పేంటని, ఓ సభ్యుడికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎక్కడిదని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును ఓపికతో చూస్తున్నామని.. కోమటిరెడ్డి, సంపత్‌ని గత సభలో ఏం చేసారో మనం చూడలేదా? అని అన్నారు. ఓ అరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే గాని వారికి బుద్ధి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మూసీ ప్రక్షాళనపై డీపీఆర్ అడుగుతున్నారు..

గత ప్రభుత్వంలో కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగిపోయినట్లు రేవంత్ రెడ్డి అన్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి డీపీఆర్ లేదని, కానీ మూసీ అభివృద్ధి పనులు మొదలుపెట్టకముందే కేటీఆర్ డీపీఆర్ అడుగుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. మూసీ కబ్జాలను త్వరలోనే తొలగిస్తామని వెల్లడించారు. అలాగే అక్రమంగా నిర్మించిన 10,800ఇళ్లు మూసీపై ఉన్నాయని, వారందరికీ ప్రత్యమ్నాయం చూపించి భూమి కేటాయిస్తామన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రైమ్ రేటు తగ్గింది..

హైదరాబాద్‌లో రోడ్లపై నీరు ఆగకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్‌లను ఏర్పాటు చేస్తు్న్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గుర్తించిన 141ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఉంటారని, ఆఫీసులకే పరిమితం అయిన అధికారులను ఫిజికల్ పోలిసింగ్ చేపిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అధికారులు రోడ్లపైకి రాకపోతే తానే వస్తానంటూ సీఎం చెప్పారు. బీఆర్ఎస్ హయాంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రైమ్ రేటు తగ్గినట్లు సీఎం చెప్పుకొచ్చారు. అవసరాన్ని బట్టి ఒక్కో ప్రభుత్వ సంస్థను ఒక్కో సందర్భంలో తీసుకొచ్చారని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హైడ్రాను తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.


జాబ్ క్యాలెండర్‌పై కేటీఆర్ నిరసన..

మరోవైపు జాబ్ క్యాలెండర్‌పై చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. ఆయనతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు 2లక్షల ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల వివరాలు ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇప్పుడు బోగస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని ఆగ్రహించారు. దీంతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - Aug 02 , 2024 | 09:15 PM