Share News

CM Revanth: అక్బరుద్దీన్‌కు మాట ఇస్తున్నా.. నాలుగేళ్లలో పూర్తి చేస్తాం

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:08 PM

Telangana: పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ...పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని.. అది ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.

CM Revanth: అక్బరుద్దీన్‌కు మాట ఇస్తున్నా.. నాలుగేళ్లలో పూర్తి చేస్తాం
CM Revanth Reddy

హైదరాబాద్, జూలై 27: పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ...పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని.. అది ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంఖుస్థాపన చేశామన్నారు. రెండో దశలో 78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Drugs: డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ తండ్రీకొడుకులు...


అక్బరుద్దీన్‌కు మాట ఇస్తున్నా....

‘‘అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు.. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి... ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు. గుజరాత్, బీహార్‌లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరాం. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసాం. ఈ మాటలు నేను ఎక్కడో చెవిలో చెప్పలేదు. ఆదిలాబాద్ సభలో అందరి ముందే చెప్పా. రాజకీయ ప్రయోజనం కోసం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పా. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని మేం మాటలతో కాలయపన చేయం. అక్బరుద్దీన్‌కు నేను మాట ఇస్తున్నా. 2029 ఎన్నికల నాటికి మెట్రో రైల్‌లో ఓల్డ్ సిటీలో తిరుగుతాం.. మేం ఏం చెప్పామో అది చేసి తీరుతాం. కేంద్రం నిధులు ఇచ్చినా. ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తిచేస్తాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.


మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీతో చర్చలు జరుగుతున్నాయన్నారు. హైటెక్‌ సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు నిర్మాణానికి టెండర్లు గత ప్రభుత్వం పిలిచిందన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ వరకు 33 కి.మీ. నిర్మాణానికి టెండర్లు వేశామని.. స్థిరాస్తి సంస్థలకు మేలు చేసేందుకే..ఆ మార్గంలో మెట్రో అని తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు మంచి రోడ్లు ఉన్నాయన్నారు. ఎల్బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మెట్రో నిర్మించనుందన్నారు. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం ఉంటుందన్నారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే.. కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి భూసేకరణను ఇప్పటికే మొదలుపెట్టామన్నారు. పాతబస్తీ, ఎయిర్‌పోర్ట్‌కు మెట్రోను కచ్చితంగా నిర్మించి తీరుతామని రేవంత్ వెల్లడించారు.


హరీష్‌రావుపై సీఎం ఫైర్

అంతకుముందు కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. గొర్రెల పథకంలో రూ.700 కోట్లు స్వాహా చేశారని.. బతుకమ్మ చీరల విషయంలో కూడా దోపిడీ జరిగిందన్నారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్‌.. అమ్మకాల లెక్కలు చెప్పట్లేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలు వేల కోట్ల విలువచేసే భూములు అమ్మేశారన్నారు. కాళేశ్వరంలోనూ భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నారు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన గొర్రెల పంపిణీ.. బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్లపై విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. పాలమూరు జిల్లా ప్రజలకు కేసీఆర్‌కు ఏం ద్రోహం చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రజలు అంటే కేసీఆర్‌కు ఎందుకు కోపమన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పాలమూరు వెనుకబాటుకు బీఆర్‌ఎస్సే కారణమన్నారు. రంగారెడ్డిజిల్లాలో కూడా వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారన్నారు. బీఆర్‌ఎస్ ఆలోచన, విధానం రెండూమారలేదన్నారు. బీఆర్‌ఎస్‌ తీరు వల్లే కేంద్ర బడ్జెట్‌లో ఒక్కపైసా కూడా రాలేదని విమర్శించారు.

YS Jagan: వైఎస్ జగన్‌ను నెటిజన్లు గట్టిగానే ఆడుకుంటున్నారే..!


పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని.. చేవెళ్ల- రంగారెడ్డి ప్రాజెక్టుకు నిర్వీర్యం చేశారని విమర్శించారు. కట్టడాల గురించి చెబుతున్నారు.. అప్పుల సంగతేంటని ప్రశ్నించారు. సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత తనకుందన్నారు. సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల దగ్గర మీటర్లు పెడతామని.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంతకాలు చేసిందన్నారు. ప్రతిపక్షం విలువైన సూచనలు చేస్తే తీసుకుంటామని సూచించారు. ప్రతిపక్ష నేత రాకపోయినా ఆ సమయాన్ని వారి పార్టీకి ఇచ్చామన్నారు. మీటర్లు పెట్టమన్నా.. పెట్టలేదని హరీష్ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కేంద్రం, రాష్ట్రం, డిస్కంలు 2017 జనవరిలో ఒప్పందం చేసుకున్నాయన్నారు. 2017జూన్ 13లోపు మోటార్లకు మీటర్లు పెడతామని సంతకం చేశారని తెలిపారు. అధికారులు అజయ్ మిశ్రా, రఘుమా రెడ్డి, గోపాల్‌రావు సంతకాలు చేశారన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నారని తెలిపారు. హరీశ్‌రావుకు హాఫ్ నాలెడ్జ్, పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్ అంటూ ఎద్దేవా చేశారు. హరీశ్‌ చెప్పిన తప్పులను రికార్డుల నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌ కోరారు.


ఇవి కూడా చదవండి...

Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..

Bandi Sanjay: కాళేశ్వరం వెళ్లి ఏం సాధించావ్ కేటీఆర్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 05:19 PM