Share News

YS Jagan: వైఎస్ జగన్‌ను నెటిజన్లు గట్టిగానే ఆడుకుంటున్నారే..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:18 PM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌కు ట్రోలింగ్ దెబ్బ గట్టిగానే పడుతోంది. మాజీ సీఎం సోషల్ మీడియా పోస్టులను నెటిజన్లు వెంటాడుతున్నపరిస్థితి. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ పెడుతున్న పోస్టులపై ట్విట్టర్‌లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చివరకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిపై జగన్ చేసిన ట్వీట్‌పైనా తూర్పారపడుతూ ప్రశ్నలతో ట్వీట్లు హోరెత్తిస్తున్నారు.

YS Jagan: వైఎస్ జగన్‌ను నెటిజన్లు గట్టిగానే ఆడుకుంటున్నారే..!
YSRCP Chief YS Jaganmohan reddy

అమరావతి, జూలై 27: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ని (Former CM YS Jaganmohan reddy) సోషల్ మీడియా వేదికగా ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.! మాజీ సీఎం సోషల్ మీడియా పోస్టులను నెటిజన్లు వెంటాడుతున్న పరిస్థితి.! ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ పెడుతున్న పోస్టులపై ట్విట్టర్‌లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చివరికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిపై జగన్ చేసిన ట్వీట్‌పైనా తూర్పారపడుతూ ప్రశ్నలతో ట్వీట్లు హోరెత్తిస్తున్నారు. అబ్దుల్ కలాం పథమ పౌరుడు అంటూ ట్వీట్‌లో జగన్ ప్రస్తావించగా... ‘‘నువ్వు అథమ పౌరుడు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

EMPS: ఎలక్ట్రిక్ వాహనాల స్కీం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం


అబ్దుల్ కలాం పేరు ఎత్తే అర్హత లేదంటూ సోషల్ మీడియాలో కౌంటర్ ట్వీట్లు వెల్లువెత్తున్నాయి. అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డులకు పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నప్పుడు ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త అని గుర్తు లేదా..? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టినప్పుడు ఈ బుద్ధి ఏమయ్యింది..? అంటూ వీడియోలు పెట్టిమరీ ప్రశ్నలు సంధిస్తున్నారు. అబ్దుల్ కలాం పేరు తలచే అర్హత కూడా తమరికి లేదు జగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురుస్తోంది.

Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..


ఒకటా రెండా.. ఎన్నో..!

కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది మొదలుకుని దిగిపోయే ముందు వరకూ చేయాల్సిన అరచకాలన్నీ చేసేసిందనే ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలు ఒకటా రెండా లెక్కలేనన్ని ఉన్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు గాంధీ, కలాం, ఎన్టీఆర్ ఇలా ఎవరి పేరు కనిపించినా సరే రోజుల వ్యవధిలోనే పేర్లు మార్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇదేంటని ప్రశ్నించినా.. విమర్శించినా వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక పోస్టు పెడితే చాలు.. వారిపై కేసులు పెడుతూ నానా ఇబ్బందులకు గురిచేసేవారు. అలా చాలా మందే వైసీపీ హాయంలో పోస్టులు పెట్టి ఇబ్బంది పడ్డారు కూడా. సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ పలువురిని అరెస్ట్ చేసిన పరిస్థితులూ ఉన్నాయి. అసలు ప్రభుత్వానికి సంబంధించి ఏ పోస్టులు పెట్టాలన్నా భయపడే స్థితికి తీసుకొచ్చారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు అవర్ టర్న్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు జగన్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో జగన్ పెట్టిన ప్రతి పోస్టుపైనా ట్రోలింగ్ నడుస్తోంది.


ఇవి కూడా చదవండి...

Telangana Assembly: హరీష్ vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ..!

Union Minister Murugan: ఏపీ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 03:25 PM