CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:34 PM
హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. ఇక నుంచి ప్రతీ ఏడాది సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని ఉద్ఘాటించారు.
హైదరాబాద్: మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం జరిగింది. సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని ప్రశంసించారు. ఇక నుంచి ప్రతీ ఏడాది సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని ఉద్ఘాటించారు. యాదవులు రాకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపించామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలని కోరారు. ఏ శక్తులు అడ్డువచ్చినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నామని చెప్పారు. యాదవ సోదరులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఆనాడు ముషీరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించి ఉంటే.. యాదవుల వైపు నుంచి మంత్రిగా నిలబడేవారని చెప్పారు. ఆయన ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యత ఉండాలని అనిల్‌కు రాజ్యసభ ఇచ్చానని గుర్తుచేశారు..యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kishan Reddy: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది
Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
AV Ranganath: అనుమతులుంటే కూల్చం
KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
Read Latest Telangana News and Telugu News