Share News

CM REVANTH REDDY: అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలుపుతా

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:45 AM

తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా...సమున్నతంగా ముందుకు తీసుకువెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమ శ్రామికుడిగా... మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో... సకల జనహితమే పరమావధిగా ముందుకు సాగుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM REVANTH REDDY: అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలుపుతా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. ఓడిపోయిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ 14వ తేదీ నుంచి మొదలు సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 09వ తేదీ వరకు.. ప్రజా విజయోజ్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్(ఎక్స్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా ముందుకు తీసుకువెళ్తా..

revanth2.jpg

‘‘పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను.. ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను... అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి... డిసెంబర్ 7, 2023 నాడు.. తెలంగాణ నా చేతుల్లో పెట్టింది. తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా...సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది. ఆక్షణం నుంచి... జన సేవకుడిగా... ప్రజా సంక్షేమ శ్రామికుడిగా... మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో... సకల జనహితమే పరమావధిగా... జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా... సహచరుల సహకారంతో... జనహితుల ప్రోత్సాహంతో... విమర్శలను సహిస్తూ... విద్వేషాలను ఎదురిస్తూ... స్వేచ్ఛకు రెక్కలు తొడిగి... ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి... అవనిపై అగ్ర భాగాన … తెలంగాణను నిలిపేందుకు... గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ...నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ... నిరంతరం జ్వలించే.. ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా... విరామం ఎరుగక... విశ్రాంతి కోరక...ముందుకు సాగిపోతున్నాను.ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి... సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG NEWS: కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ.. కారణమిదే

KTR: రేవంత్ ప్రభుత్వం అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.. కేటీఆర్ ధ్వజం

CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 10:47 AM