CM Revanth Reddy: వాళ్ల వెన్నులో వణుకుపుట్టాలి.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
ABN , Publish Date - Dec 06 , 2024 | 07:46 PM
పైరవీలు లేకుండా పోలీసులకు పదోన్నతులు, బదిలీలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్, ఫైర్ శాఖల్లో 15 వేలమందికి నియామక పత్రాలు అందజేసినట్లు వివరించారు. సైబర్, డ్రగ్స్ పేరుతో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ అరికడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డ్రగ్స్ రవాణాదారులు తెలంగాణ రావాలంటే భయపడాలని హెచ్చరించారు. డ్రగ్స్‌పై కాలేజ్‌లు, స్కూళ్లలో అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల భవిష్యత్ పట్ల పాఠశాల యాజమాన్యాలు బాధ్యతగా ఉండాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి కేసులు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావులేకుండా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
పైరవీలు లేకుండా పోలీసులకు పదోన్నతులు, బదిలీలు చేస్తున్నామని తెలిపారు. పోలీస్, ఫైర్ శాఖల్లో 15 వేలమందికి నియామక పత్రాలు అందజేసినట్లు వివరించారు. సైబర్, డ్రగ్స్ పేరుతో కొత్త నేరాలు పుట్టుకువస్తున్నాయని హెచ్చరించారు. టీజీన్యాబ్‌కు డీజీ స్థాయి అధికారిని నియమించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ లో ఎస్టీఆర్ ఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 వేలమంది సిబ్బందితో తెలంగాణ ఎస్టీఆర్ ఫ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధునాతన పరికరాలు, కొత్త ఫైరింజన్లు కొనుగోలు చేశామని అన్నారు. ఎస్టీఆర్ ఫ్ వాహనాలు, బోట్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చూడాలని సూచించారు.
ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యను మానవీయ కోణంలో చూడాలన్నారు. ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 14 వేలమంది హోంగార్డులు ఉన్నారని గుర్తుచేశారు. హోంగార్డులకు రోజుకు రూ.1000 వేతనం ఇస్తామని మాటిచ్చారు. హోంగార్డుల వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.200 చేస్తామన్నారు. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని అన్నారు. హోంగార్డులకు మెరుగైన వైద్య సాయం అందజేస్తామన్నారు. పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. యంగ్‌ఇండియా పోలీస్ స్కూలుకు 50 ఎకరాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా
CM Revanth Reddy: కేసీఆర్! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్
KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా
Read Latest Telangana News And Telugu News