Share News

CM Revanth: ఢిల్లీ ఘటనపై సీఎం రేవంత్ ఆరా

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:48 PM

ఢిల్లీలో భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని సీఎం అన్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

CM Revanth: ఢిల్లీ ఘటనపై సీఎం రేవంత్ ఆరా
CM Revanth Reddy

హైదరాబాద్: ఢిల్లీలో భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని సీఎం అన్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారో అని ముఖ్యమంత్రి ఆరా తీశారు.

ఈ విషయంపై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్పల్‌తో సీఎం రేవంత్ మాట్లాడారు. ఘ‌ట‌న వివ‌రాలు, తెలంగాణ వాసులు ఎవ‌రైనా ఉన్నారా అని ప్రశ్నించారు. మృతుల్లో ఎవ‌రైనా రాష్ట్ర వాసులంటే బాధిత కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌ స‌హ‌కారాలు అందించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వాసులు ఎవ‌రూ లేర‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్పల్‌ తెలిపారు.


రేవంత్ ఆదేశాలు

మృతుల్లో తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువ‌తి అని, ఆమె తండ్రి విజ‌య్ కుమార్ సింగ‌రేణి సంస్థలో సీనియ‌ర్ మేనేజ‌ర్‌గా మంచిర్యాల‌లో ప‌ని చేస్తున్నార‌ని ముఖ్యమంత్రికి రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌ తెలిపారు. విజ‌య్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు. తానియా సోని మృత‌దేహాన్ని బీహార్ త‌ర‌లించ‌డానికి వారి కుటుంబ స‌భ్యులు ఏర్పాటు చేసుకుంటున్నార‌ని రెసిడెంట్ క‌మిష‌న‌ర్‌ చెప్పారు. వారి కుటుంబానికి అవ‌స‌ర‌మైన స‌హ‌యం అందిస్తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రెసిడెంట్ క‌మిష‌న‌ర్ ఉప్పల్ తెలిపారు.


Also Read: TG News: ఢిల్లీ వరదల్లో తెలంగాణ విద్యార్థిని మృతి.. కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి..

పోలీసులు తక్షణ చర్యలు

మరోవైపు.. సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ (IAS coaching centre) లోకి వరద పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, అభ్యర్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను ఆదివారం నాడు అదుపులోనికి తీసుకున్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌, బిల్డింగ్ మేనేజిమెంట్‌, ఆ ప్రాంతంలో డ్రైనేజ్ మేనేజిమెంట్‌కు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సెంట్రల్ ఎం.వర్షవర్ధన్ తెలిపారు. బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 105, 106(1), 115(2), 35 కింద కేసులు పెట్టామని, ఇంతవరకూ కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్‌ను నిర్బంధంలోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు.


పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు..

ఓల్డ్ రాజేంద్రనగర్ కోచింగ్ సెంటర్‌లో వరద పోటెత్తి మరణించిన అభ్యర్థులు ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరిని ఉత్తరప్రదేశ్‌‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన శ్రేయా యాదవ్, మరొకరిని తెలంగాణకు చెందిన తాన్యా సోని, మూడో వ్యక్తిని కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నెవిన్ డాల్విన్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్యయంతో రెస్యూ ఆపరేషన్ నిర్వహించి కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ నుంచి ముగ్గురు అభ్యర్థుల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురునీ గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేసినట్టు డీసీపీ తెలిపారు. అభ్యర్థుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపారు.


అభ్యర్థుల ఆందోళన...

కాగా, అభ్యర్థుల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరనలకు దిగిన విద్యార్థులను అడిషినల్ డిప్యూటీ కమిషనర్ సచిన్ శర్మ ఆదివారం ఉదయం కలిసి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారని, ఏ విషయాన్ని తాము దాచిపెట్టమని, చట్టబద్ధంగా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని, విచారణ జరుగుతోందని చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బాధ్యతారాహిత్యంపై అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యురాలు స్వాతిమలివాల్ సైతం ఘటనా స్థలికి వెళ్లి అభ్యర్థుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన.. జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ..

Bonalu Festival: భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్.. హాట్ కామెంట్స్..

CM Revanth Reddy: కాంగ్రెస్‌ ఇచ్చిందీ గాడిద గుడ్డే!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 05:08 PM