Share News

Hyderabad: ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:48 PM

డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Hyderabad: ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
CM Revanth Reddy

హైదరాబాద్: ఏడాది పాలనలో రుణమాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు మూడ్రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.


సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ఇదే..

"తెలంగాణ ప్రజలందరి నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ మొదటి సంవత్సరంలో వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో మీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. మన రాష్ట్ర మహిళా సంక్షేమ పథకాలు, కులగణన, పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలను పక్క రాష్ట్రాలు సైతం అనుకరిస్తున్నాయి. నేను మీ ప్రభుత్వం సాధించిన కొన్ని కీలక విజయాలు మరోసారి గుర్తు చేయాలని అనుకుంటున్నా.


  • మహిళా సంక్షేమం కోసం ఉచిత బస్సు ప్రయాణం

  • 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్

  • 25 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ

  • రూ.21వేల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ

  • ఎంఎస్పీ కంటే ఎక్కువ ఉన్న సన్న బియ్యం క్వింటాకు రూ.500 బోనస్

  • రైతులకు 24/7 ఉచిత విద్యుత్

  • 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి

  • అధికారం చేపట్టిన మెుదటి ఏడాదిలోనే యువతకు 55 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు

  • ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను సృష్టించి, 12 ఏళ్లలో అత్యల్ప నిరుద్యోగిత రికార్డు నమోదు

  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు

  • మాదక ద్రవ్యాలు నిర్మూలన, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం

  • యంగ్ ఇండియా స్కిల్ విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు

  • గత తొమ్మిది నెలల్లో ఎఫ్‌డీఐలు రెట్టింపు

  • గత 11 నెలల్లో మొత్తం పెట్టుబడులు 200 శాతానికి పైగా పెరిగాయి

  • క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అర్బన్ రీఇమాజినేషన్ ప్రోగ్రామ్‌ను చేపట్టి దేశంలోనే హైదరాబాద్‌ను మొదటి నగరంగా మార్చడం

  • భారీ వృద్ధి, జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడానికి ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీజనల్ రింగ్ రోడ్

  • రీజనల్ రింగ్ రైలు, రేడియల్ రోడ్లు, మెట్రో రైల్, భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో సహా అనేక ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించడం

  • తెలంగాణలో సమగ్ర కులగణన

  • హైదరాబాద్ నగరంలో త్వరలో ట్రాన్స్‌జెండర్ మార్షల్స్ ద్వారా ట్రాఫిక్‌ను నిర్వహించే భారతదేశపు మొదటి నగరంగా అవతరించబోతున్నాం" అని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: నేడు అంగరంగ వైభవంగా ప్రజాపాలన విజయోత్సవాలు..

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు..

Updated Date - Dec 08 , 2024 | 12:50 PM