Share News

CM Revanth Reddy: గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:01 PM

ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్‎రెడ్డి ఈరోజు(శనివారం) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ‎రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని తెలిపారు.

CM Revanth Reddy: గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్‎రెడ్డి ఈరోజు(శనివారం) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ‎రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని తెలిపారు. 70 ఏళ్లుగా నిష్టతో, భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. తమ ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టిందని సీఎం రేవంత్ ‎రెడ్డి తెలిపారు.


హైదరాబాద్ నగరంలో భక్తులు లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారని వివరించారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిందని చెప్పారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని అన్నారు. అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి భయటపడ్డామని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.


దివంగత నేత పి.జనార్ధనరెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఖైరతాబాద్‎లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా.., ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని గుర్తుచేసుకున్నారు. ప్రతీ ఏడాది ఉత్సవ కమిటీ ఖైరతాబాద్‎ గణేష్ ఉత్సవాలకు ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్‎రెడ్డి వెల్లడించారు.

Updated Date - Sep 07 , 2024 | 05:44 PM