Share News

CM Revanth: 10 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

ABN , Publish Date - Sep 16 , 2024 | 06:27 PM

ట్యాంక్ బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సీఎం సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు.

CM Revanth:   10 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
CM Revanth Reddy

హైదరాబాద్: గణేష్ నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈరోజు(సోమవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికు సీపీ ఆనంద్ వివరించారు.


ALSO READ: CM Revanth Reddy: రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారు

చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణపై సీఎం రేవంత్ కీలక సూచనలు..

ట్యాంక్ బండ్‌తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్లకు సంబంధించి రికార్డు మెయింటనెన్స్ చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


ALSO READ: Bandi Sanjay: విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్ జంకుతుంది

సాగర్ వద్ద నిమజ్జనాల కోలాహలం

హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాల కోలాహలం నెలకొంది. నెక్లెస్ రోడ్ వద్ద నిమజ్జనానికి గణనాథులు బారులు తీరారు . పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జనాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఆరు క్రేన్లను మాత్రమే ఏర్పాటు చేయడంతో ఆలస్యంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క విగ్రహం నిమజ్జనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది.


ALSO READ: Ponnam Prabhakar: గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి

జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

కాగా, రేపటి మహా నిమజ్జనానికి జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 160 గణేష్ టీమ్స్ పని చేస్తున్నాయి. నిమజ్జనానికి మొత్తం 15 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనానికి 10 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.


ALSO READ: KTR: తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బంది పని చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 73 వినాయక పాండ్స్, పెద్ద చెరువుల్లో జీహెచ్ఎంసీ నిమజ్జన ఏర్పాట్లు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 468 క్రేన్లు. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రేపటి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..

Kaushik Reddy: రేవంత్ రెడ్డి.. నీ గుండెల్లో నిద్రపోతా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 16 , 2024 | 07:07 PM