CM Revanth: కేసీఆర్ చేసిన తప్పులు మేం చేయం.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:20 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులు, తాము చేయమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని చెప్పారు. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులు, తాము చేయమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని చెప్పారు. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. వాటి వడ్డీ ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా రూ.1000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్‌లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదని అన్నారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని హై కమాండ్ డిసైడ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రుణమాఫీపై కీలక ప్రకటన
‘‘కాంగ్రెస్ బీ ఫామ్ మిద గెలిచిన వారికి మాత్రమే పదవులు వచ్చాయి. పీసీసీ చీఫ్‌గా రెండు ఎన్నికలు పూర్తి చేశా. జూలై 7 తో మూడేళ్లు పీసీసీ పూర్తి కానుంది. పీసీసీ , కేబినెట్ విస్తరణ నిర్ణయాలు ఒకే సారి ఫైనల్ అవుతాయి. తెలంగాణలో కరెంట్ కోతలు లేవు.. సరిపడ విద్యుత్‌ను కొంటున్నాం. పంట రుణాల మాఫీకి రూ. రెండు లక్షలు పరిమితం చేస్తాం. రేషన్ కార్డ్ కుటుంబ గుర్తింపు కోసం మాత్రమే. రుణమాఫీపై 4 రోజుల్లో మార్గ నిర్దేశాకాలు విడుదల చేస్తాం. రాష్ట్రంలో విద్యుత్ కొరతలు లేవు , కంపెనీలో మెయింటెనెన్స్ తప్ప. ప్రతి ఏడాది జరిగే చెకింగ్ ప్రాసెస్ జరగకపోవడమే లేకనే రాష్ట్రంలో విద్యుత్ కోతలు. వాస్తవాలకు అనుగుణంగా మాత్రమే బడ్జెట్ ఉండాలని అధికారులకు స్పష్టంగా చెప్పాం. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలు వద్దని అధికారులను సూచించామని’’ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీ లాభాలతో నడుస్తున్నాయి..
‘‘గత ప్రభుత్వం హయాంలో బడ్జెట్ విషయంలో అలాంటి తప్పులు ఏమి చేయదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వస్తుంది. ఫ్రీ బస్ పథకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ పెరిగింది. ప్రభుత్వం 300 కోట్లు చెల్లిస్తూ వస్తోంది.. ఆర్టీసీ నిర్వహణలో వచ్చే నష్టాలు తగ్గిపోయాయి. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాలతో నడుస్తున్నాయి. రాష్ట్ర ఖజానాకు భారం ఉన్న సంక్షేమంపై దృష్టి పెడుతున్నా. రైతు రుణమాఫీ ప్రథమ లక్ష్యం. మిగిలిన అంశాలు పైన దృష్టి తర్వాత పెడతాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.