TS High Court: ప్రణీత్ రావు పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Mar 20 , 2024 | 03:57 PM
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్‌పీ ప్రణీత్‌రావు రావు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రతీణ్‌రావు హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం రేపు(గురువారం) తీర్పును ప్రకటించనుంది.
హైదరాబాద్, మార్చి 20: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping) ఎస్‌ఐబీ మాజీ డీఎస్‌పీ ప్రణీత్‌రావు (Former SIB DSP Praneet Rao Rao) రావు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) వాదనలు ముగిశాయి. పోలీస్ కస్టడీకి ఇస్తూ కిందిస్థాయి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు ధర్మాసనం రేపు (గురువారం) తీర్పును ప్రకటించనుంది.
AP Politics: షర్మిల దెబ్బ.. జగన్ అబ్బా.. ఎన్నికలవేళ పీక్స్‌కు చేరిన పాలిటిక్స్..!
ప్రణీత్ రావు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు ఇవే..
ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావును అక్రమంగా అరెస్ట్ చేశారని న్యాయవాది వాదించారు. ‘‘నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి.. కానీ అలా జరగడం లేదు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్ అప్ చేయించాలి. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెపుతున్నారు. కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యింది. పోలీస్ స్టేషన్‌లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు’’ అని లాయర్ గండ్ర మోహన్‌రావు కోర్టుకు తెలిపారు.
Lok Sabha elections: కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తులు.. గుర్రుమంటున్న సీనియర్ నేతలు
ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు
24 గంటలు ప్రణీత్ రావును పోలీస్ కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ‘‘పోలీస్ స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. ప్రణీత్ రావు అరెస్ట్ 13 మార్చి రోజున మాత్రమే డీసీపీ ప్రెస్ నోట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు మీడియాకు లీక్‌లు ఇస్తారని చెప్పడం సరైంది కాదు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నాం. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదు. ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి. మీడియాకు ప్రణీత్ వ్యవహారంలో ఎలాంటి లీకులు ఇవ్వ్వడం లేదు. ప్రణీత్ అరెస్ట్ తరువాత డీసీపీ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. మీడియా రాస్తున్న వాటికి మేము బాధ్యులం కాదు. కేస్ తీవ్రత దృష్ట్యా స్పెషల్ టీంను ఏర్పాటు చేశాం. బంజారాహిల్స్ సీఐ కూడా టీంలో ఉన్నారు. అందుకే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రణీత్‌ను విచారిస్తున్నా ము. అడిషనల్ ఎస్పీ రమేష్ దర్యాప్తులో పాల్గొనడం లేదు. రమేష్ అసలు బంజారాహిల్స్ పీఎస్‌కు రానే లేదు. రాత్రి 8 తరువాత ప్రణీత్‌ను విచారించడం లేదు. ప్రతి రోజు ప్రణీత్ కౌన్సిల్ అనుదీప్, వాసు దేవన్ ప్రణీత్‌ను కలుస్తున్నారు. వీరి ఫోన్‌ల నుంచి వారి తలిదండ్రులతోను ప్రణీత్ మాట్లాడుతున్నాడు’’ అని ప్రభుత్వ న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్ శోభన్ కోర్టుకు హాజరయ్యారు.
AP Election2024: పత్తిపాడు టీడీపీ ఇన్‌ఛార్జ్ కారుపై దాడి
ప్రణీత్ పిటిషన్‌లోని అంశాలు...
వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని ప్రణీత్ రావు తన పిటిషన్‌లో తెలిపారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని వెల్లడించారు. విచారణ పూర్తైన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలన్నారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారనా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని ప్రణీత్ రావు అన్నారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని.. బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని తెలిపారు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral video: రోబోటిక్ డాగ్‌ను చూసి ఖంగుతిన్న కుక్క.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
5G Network: 4 Gని మించిన 5 G నెట్‌వర్క్ వినియోగం.. ఎన్ని ఫోన్లలో ఉందంటే
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...