Share News

TPCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:26 PM

Telangana: టీపీసీసీ చీఫ్ పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది.

TPCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!
TPCC Chief

హైదరాబాద్, ఆగస్టు 31: టీపీసీసీ చీఫ్ (TPCC Chief) పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. మూడు రాష్ట్రాలను పీసీసీ చీఫ్‌లను ఏఐసీసీ ప్రకటించనుంది.

Chandrababu: సీఎస్, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం


ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా దీపాదాస్ మున్సీ, కేరళ పీసీసీ అధ్యక్షుడుగా కేసీ వేణుగోపాల్ పేరు ఖరారైంది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ఉండనున్నారు. మూడు రాష్ట్రాలకు ఖరారైన నూతన పీసీసీ చీఫ్‌ల పేర్లను నేడో, రేపో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.


మహేష్ గౌడ్ గురించి...

కాగా... తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌ గౌడ్ పేరును హైకమాండ్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ గౌడ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. బొమ్మ మహేష్ గౌడ్.. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

Chandrababu: సీఎస్, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం



ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మహేష్ గౌడ్ ఫేట్ మారిపోయింది. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీని ఏ తరుణంలోనూ వదిలిపెట్టలేదు. పైగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఇంత కాలానికి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలా సామాజిక సమీకరణాలు అన్నీ మహేష్‌కు కలిసొచ్చినట్టుగా సమాచారం.


ఇవి కూడా చదవండి...

Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?

Hyderabad Pubs: అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో దాడులు.. డ్రగ్ టెస్ట్ చేయగా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 31 , 2024 | 01:41 PM