Share News

Congress: బ్యాలెట్‌తోనే ఓటింగ్ జరగాలి: అద్దంకి దయాకర్

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:57 PM

సార్వత్రిక ఎన్నికలపై టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ చేసిన కామెంట్ల దుమారం కొనసాగుతోంది. పోలింగ్ జరిగే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్ జరుగుతున్నాయని కామెంట్ చేశారు. మాస్క్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఏకీభవించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలానే జరిగి ఉంటాయని సందేహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Congress: బ్యాలెట్‌తోనే ఓటింగ్ జరగాలి: అద్దంకి దయాకర్
addanki dayakar

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలపై టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ చేసిన కామెంట్ల దుమారం కొనసాగుతోంది. పోలింగ్ జరిగే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (EVM) హ్యాకింగ్ జరుగుతున్నాయని కామెంట్ చేశారు. మాస్క్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఏకీభవించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలానే జరిగి ఉంటాయని సందేహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అప్పుడే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.


బ్యాలెట్ అయితే ఓకే..!!

‘ఈవీఎంల సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరేళ్లు అవుతోన్న కేస్ పెండింగ్‌లో ఉంది. తిరిగి బ్యాలెట్ విధానం తీసుకురావాలనే డిమాండ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉండటంతో సందేహాలు కలుగుతున్నాయి. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా జరిగితే ప్రజాస్వామ్య స్వరూపం మారే పరిస్థితి ఉంటుంది. ప్రజాభిప్రాయం తెలిపేందుకు ఉన్న ఆయుధం ఓటు. ఓటును కరెప్ట్ చేసే పనిలో కొందరు హకర్స్ ఉన్నారు అని’ అద్దంకి దయాకర్ విరుచుకుపడ్డారు.


విచారణ జరగాలి....!!

‘నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఈవీఎంల పనితీరుపై విచారణ జరగాలి. పారదర్శక విచారణతోపాటు బ్యాలెట్ విధానాన్ని తీసుకొస్తే ప్రజాస్వామ్య పునాదులు మరింత బలపడతాయి. అవకతవకల వల్ల దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ఈవీఎంల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అని’ అద్దంకి దయాకర్ మోదీ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కూడబలుక్కుని కూల్చేశారు!

Updated Date - Jun 18 , 2024 | 01:57 PM