Share News

Congress: సంస్కారం కావాలంటే మేము నేర్పిస్తాం... కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత ఫైర్

ABN , Publish Date - Aug 24 , 2024 | 02:34 PM

Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ మహిళా ఫైనాన్స్ చైర్మన్ శోభారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో సంస్కారం లేని కుటుంబం కేసీఆర్ కుటుంబమని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంస్కార హీనుడంటూ వ్యాఖ్యలు చేశారు. సంస్కారం కావాలంటే గాంధీ భవన్ కొస్తే తాము నేర్పిస్తామన్నారు.

Congress: సంస్కారం కావాలంటే మేము నేర్పిస్తాం... కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత ఫైర్
Congress Leader Shobha Rani

హైదరాబాద్, ఆగస్టు 24: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) కుటుంబంపై కాంగ్రెస్ మహిళా ఫైనాన్స్ చైర్మన్ శోభారాణి (Congress Leader Shobharani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో సంస్కారం లేని కుటుంబం కేసీఆర్ కుటుంబమని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) సంస్కార హీనుడంటూ వ్యాఖ్యలు చేశారు. సంస్కారం కావాలంటే గాంధీ భవన్ కొస్తే తాము నేర్పిస్తామన్నారు. పదేండ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు.

7th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో గుడ్ న్యూస్.. ఇకపై జీతాలు ఏకంగా..


మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఓర్చుకోలేకపోతున్నారని.. అందుకే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారని.. దాని పర్యవసానమే ఈరోజు మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరయ్యారన్నారు. మహిళలకు గౌవరవం దక్కాలంటే అది కాంగ్రెస్‌లోనే దక్కుతుందని తెలిపారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న వదులుకున్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని శోభారాణి పేర్కొన్నారు.


మహిళ కమిషన్ ఎదుట కేటీఆర్

కాగా.. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు ఈరోజు మహిళ కమిషన్‌ ముందు కేటీఆర్ హాజరయ్యారు. వివరణ ఇచ్చేందుకని ఆయన వస్తే.. మహిళా కమిషన్ సభ్యులు పోటీలు పడి మరీ రాఖీలు కట్టడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. విచారణకు పిలిచి కేటీఆర్‌కు రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని మహిళా కమిషన్ సభ్యులు చాటుకున్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవేనని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.


ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంలో మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కొంతమంది చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటామని అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది.

Viral Video: ఆ యువకుడి ధైర్యసాహసాలు హీరోని చేశాయి.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు


మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మహిళల గురించి వివాదాస్పద కామెంట్స్ చేశారని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీస్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ కేటీఆర్ మహిళ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన క్షమాపణ చెప్పారు. యథాలాపంగా అన్నవే తప్పా మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా భవ్యారెడ్డి

TG News: ఎన్నో కలలతో అత్తగారింట అడుగుపెట్టిన ఆ వధువు నెల తిరిగేసరికి...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2024 | 02:42 PM