Ponnam: దేశ ప్రజలకు అమ్మగా ఇందిరాగాంధీ చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 31 , 2024 | 11:50 AM
Telangana: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. నెక్స్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం నివాళులర్పించారు. అలాగే గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, వీహెచ్ నివాళులర్పించారు.
హైదరాబాద్, అక్టోబర్ 31: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ (Indira Gandhi) వర్ధంతి సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) నివాళులర్పించారు. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కలిసి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయమన్నారు.
Viral: కోడిపుంజు ఉదయాన్నే ఎందుకు కూత వేస్తుంది.. ఇదీ అసలు రహస్యం..
ఈరోజుకు కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలుస్తున్న ఇందిరమ్మకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. యువత ముఖ్యంగా మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా తమ తమ రంగాల్లో వృత్తి, వ్యవహారపరంగా ఎలా ఉండాలనేదానికి ఇందిరా గాంధీ ఆదర్శంగా నిలిచారు. అందుకే మరోసారి ఇందిరమ్మ లాంటి నాయకురాలు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రపంచ స్థాయిలో నిలిచిన నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. అత్యధిక కాలం ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీకి కాంగ్రెస్ పక్షాన, హైదారాబాద్ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.
ఉక్కు మహిళగా పేరు: టీపీసీసీ చీఫ్
ఇటు గాంధీభవన్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు ఇందిరాగాంధీకి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరు పొందారని తెలిపారు. దేశం సురక్షితంగా ఉండాలని ఉగ్రవాదుల తూటాలకి ఇందిరా గాంధీ బలయ్యారన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఆమెని అనుసరిస్తూ పీవీ నరసింహా రావు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Free Bus Scheme: దీపావళి వేళ మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ పథకం రద్దు
దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారు: వీహెచ్
బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ అని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. దేశానికి సేవ చేయడంలో భాగంగా ఉగ్రవాదుల చేతిలో ఇందిరా గాంధీ చనిపోయారన్నారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం బీజేపీ నేతలకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసమే బీజేపీ నేతలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తొస్తారంటూ వీహెచ్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..
Diwali 2024: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు
Read Latest Telangana News And Telugu News