ABN Group: లక్ష్యంగా హ్యాకర్ల దాడులు
ABN , Publish Date - Oct 15 , 2024 | 03:29 AM
అత్యధిక ప్రజాదరణ పొందిన ‘ఆంధ్రజ్యోతి’ వెబ్‌సైట్‌తోపాటు ఏబీఎన్ గ్రూప్ ఆఫ్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని.. కొందరు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు.
ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్, ఏబీఎన్ గ్రూప్ ఆఫ్ నెట్‌వర్క్ లక్ష్యంగా హ్యాకింగ్
‘సైబర్ క్రైం’లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఫిర్యాదు
‘సాక్షి’ చానల్‌పై అనుమానాలున్నాయని వెల్లడి
కేసు నమోదు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : అత్యధిక ప్రజాదరణ పొందిన ‘ఆంధ్రజ్యోతి’ వెబ్‌సైట్‌తోపాటు ఏబీఎన్ గ్రూప్ ఆఫ్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని.. కొందరు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ మేరకు బాధ్యుల్ని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, మొత్తం వ్యవహారంలో ‘సాక్షి’ చానల్‌పై తమకు సందేహం ఉందని సైబర్ క్రైం పోలీసులకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ హెచ్‌ఆర్ మేనేజర్ బీ మహేందర్ సోమవారం ఫిర్యాదు చేశారు. రెండు నెలలుగా తాము అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అందులో ప్రస్తావించారు. గూగుల్‌లో ‘ఆంధ్రజ్యోతి’ అని సెర్చ్ చేసినా.. ‘సాక్షి’ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుందని, హ్యాకింగ్ వల్ల ఏబీఎన్ వాట్సాప్ యాప్ చానల్ వేలాది మంది వీక్షకుల్ని కోల్పోయిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:
Sakshi Bad Manner: నిన్నటి వరకు డేటా చోరీ.. నేడు కంటెంట్‌లో కల్తీ..
ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్, ఏబీఎన్ గ్రూప్ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసి.. సదరు ట్రాఫిక్‌ను ‘సాక్షి’కి మళ్లించడం వల్ల తాము ప్రతి నెలా రూ.50 లక్షల వరకు నష్టపోతున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఓబీ వ్యాన్(డీఎస్‌ఎన్‌జీ) శాటిలైట్ ఫ్రీక్వెన్సీ సైతం హ్యాక్ అయిందని, ఈ అంశంపై ఇప్పటికే ఇస్రోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఓబీ వ్యాన్ హ్యాకింగ్‌పై ఇస్రో విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. హ్యాకింగ్ కారణంగానే వివిధ యాప్ స్టోర్ల నుంచి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
ఇది కూడా చదవండి:
Sakshi Bad Manner: సొమ్ము చేసుకోవాలనుకుని, అడ్డంగా బుక్కై.. తోక ముడిచిన 'సాక్షి'
వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు..
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ‘ఏబీఎన్ ఎనిమీస్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, తీవ్ర పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టి సోషల్ మీడియా వేదికగా తమ పరువుకు భంగం కలిగించే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈ పరిణామాలన్నింటికి సంబంధించి సాక్షి చానల్‌పై తమకు అనుమానాలున్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఐటీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
Sakshi Bad Manner: నిన్నటి వరకు డేటా చోరీ.. నేడు కంటెంట్‌లో కల్తీ..
Sakshi Bad Manner: సొమ్ము చేసుకోవాలనుకుని, అడ్డంగా బుక్కై.. తోక ముడిచిన 'సాక్షి'