Crime News: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ఒక్కొక్కరూ చెల్లించింది లక్షల్లోనే..
ABN , Publish Date - Jul 16 , 2024 | 08:08 PM
ఉద్యోగాల పేరుతో సైబరాబాద్ పరిధిలో భారీ మోసం జరిగింది. కిలారు సీతయ్య అనే వ్యక్తి పేరు మోసిన కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశాడు. ఆ నగదుతో ఆన్‌లైన్ గేమ్స్, ట్రేడింగ్, జల్సాలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో సైబరాబాద్ పరిధిలో భారీ మోసం జరిగింది. కిలారు సీతయ్య అనే వ్యక్తి పేరు మోసిన కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశాడు. ఆ నగదుతో ఆన్‌లైన్ గేమ్స్, ట్రేడింగ్, జల్సాలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అరెస్టు చేశారు.
Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ.. ఎవరికంటే?
CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిలారు సీతయ్య అనే వ్యక్తి లింక్డిన్, నౌకరీల ద్వారా నిరుద్యోగులను టార్గెట్ చేశాడు. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా పేరుతో వారికి ఫోన్లు చేసి జాబ్ ఆఫర్ చేశాడు. ఉద్యోగం ఇవ్వాలంటే తాను చెప్పినంత నగదు ఇవ్వాలని చెప్పాడు. ఇన్నాళ్లూ కాళీగా ఉన్న తమకు ఉద్యోగం రాబోతుందని ఒక్కొక్కరు లక్షలు చెల్లించారు. వారు చెల్లించిన సొమ్ముతో కిలారు సీతయ్య జల్సాలు చేశాడు. ఒక్కసారిగా లక్షలు వచ్చి చేతిలో పడడంతో ఆన్‌లైన్ గేమ్స్, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేశాడు. డబ్బులు ఎన్ని రోజులైనా ఉద్యోగం చూపించకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా పేరుతో ఫోన్లు చేసింది సీతయ్యగా తేల్చారు. దీంతో అతనిపై మెుత్తం 8కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వేలు, లక్షల్లో జీతాలు అంటూ వచ్చే ఫోన్ కాల్స్‌పై నిరుద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..
Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్