Share News

Hyderabad Biryani: ఆ అవార్డుల జాబితాలో హైదరాబాద్ బిర్యానికి చివరి స్థానం

ABN , Publish Date - Dec 13 , 2024 | 01:17 PM

హైదరాబాద్ బిర్యానీ అనేది హైదరాబాదీ వంటకాలలో కీలకమైన వంటకం మరియు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అయితే దీని బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది.

Hyderabad Biryani: ఆ అవార్డుల జాబితాలో హైదరాబాద్ బిర్యానికి చివరి స్థానం

హైదరాబాద్ : హైదరాబాద్ బిర్యాని గ్రాఫ్ పడిపోయింది. ప్రపంచ వంటకాల జాబితాలో 50వ ర్యాంక్ సాధించింది. టేస్ట్ అట్లాస్ అవార్డుల జాబితాలో హైదరాబాద్ బిర్యానీకి చివరి స్థానం వచ్చింది. గతంలో టాప్ 10లో హైదరాబాదీ ధమ్ బిర్యానీ ఉండేది. హైదరాబాద్ కంటే బెస్ట్ ఫుడ్ జాబితాలో ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ స్థానం సంపాదించాయి. అత్యుత్తమ 100 రెస్టారెంట్ల జాబితాలో బెంగళూరు, కోల్‌కత్తా, పంజాబ్ నగరాలు చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్‌లోని ఒక్క రెస్టారెంట్‌కు కూడా స్థానం దక్కలేదు. సిటీలో ఫుడ్ పాయిజన్ కేసులతో రెస్టారెంట్లలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీ దెబ్బతింది.


భయపడేలా స్ట్రీట్‌ ఫుడ్

కాగా.. సరదాగా బయటకు వెళ్లినప్పుడు స్ట్రీట్‌ ఫుడ్‌ తినడం కామన్. వారాంతరాల్లో కొందరూ అదే పనిగా బయటకు వెళ్లి మరీ స్ట్రీడ్‌ ఫుడ్‌ను తింటుంటారు. వారానికి ఒక్కసారైనా బయట ఫుడ్ తినాలని ఆలోచించే వారు ఎంతోమంది ఉంటారు. అలాగే బిర్యానీ, పానీపూరీ, కబాబ్స్, బర్గర్లు, షవర్మా, బజ్జీలు ఇలా ఏదైనా కనిపిస్తే చాలు లొట్టలేసుకుని మరీ తింటారు. అయితే స్ట్రీట్‌ ఫుడ్ అంటే భయపడేలా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. వీరి నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింటుంది. భాగ్యనగరంలో ఫుడ్స్ సేఫ్టీ‌పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వేలో ఫుడ్ క్వాలిటీ‌లో హైదరాబాద్ చివరిగా నిలిచింది.


సర్వేలో షాకింగ్ విషయాలు...

గతంలో.. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడైంది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు భాగ్యనగరంలో నమోదయ్యాయి. . 62% హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగనున్నాయి.


ఆహార నాణ్యతపై వైద్య ఆరోగ్యశాఖ సీరియస్ ...

కాగా ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా తెలంగాణలో ఉన్న హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని హోటళ్లు ఉన్నాయన్నదానిపై వైద్య ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది. హోటళ్ల సంఖ్య లెక్కతేలిన తర్వాత.. ఎన్ని హోటళ్లకు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలన్నవిషయంపై నిర్ణయానికి రానున్నారు. దీనిపై ఒక కమిటీని వేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్‌ చివరికి హైదరాబాద్‌లో 74,807 రెస్టారెంట్లు ఉన్నాయి.


భారీ స్థాయిలో ఫుడ్‌ బిజినెస్‌..

ఇవి కాకుండా తగిన అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన హోటళ్లు, రెస్టారెంట్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఏటా ఈ హోటళ్ల ద్వారా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఇంత భారీ స్థాయిలో ఫుడ్‌ బిజినెస్‌ జరుగుతున్నప్పటికీ హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించే విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం బాగా వెనుకబడింది. మానవ వనరుల కొరత కారణంగా పర్యవేక్షణ అసలే ఉండటం లేదు. హైదరాబాద్‌లో 74 వేల రెస్టారెంట్లు ఉంటే కేవలం 23 మందే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లున్నారు. అంటే ప్రతీ 3,552 రెస్టారెంట్లకు ఒక ఆహార తనిఖీ అధికారి ఉన్నారన్నమాట. దీన్ని బట్టి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ అధికారి సెలవు రోజులు మినహాయించి, రోజుకు 10 చొప్పున హోటళ్లు తనిఖీ చేసినా కూడా ఒక ఏడాదిలో అన్ని హోటళ్లను తనిఖీ చేయడం అసాధ్యం. కాగా, ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని చాలా హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు నిర్వహించగా దాదాపు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తేలింది.


Also Read:

మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

తగ్గేదేలే అంటున్న పసిడి

మీరు కూర్చునే భంగిమ.. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 13 , 2024 | 01:25 PM