Heavy Rains: నిర్మల్ సహా రెండు జిల్లాలకు ప్రమాదం.. ఫైర్ డీజీ హెచ్చరిక
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:57 PM
Telangana: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అగ్నిమాపక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఫైర్ డీజీ నాగిరెడ్డి (Fire DG Nagireddy) తెలిపారు. సోమవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రెండువేల మందికి పైగా రెస్క్యూ ఆపరేషన్‌తో రక్షించామన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains) అగ్నిమాపక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఫైర్ డీజీ నాగిరెడ్డి (Fire DG Nagireddy) తెలిపారు. సోమవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రెండువేల మందికి పైగా రెస్క్యూ ఆపరేషన్‌తో రక్షించామన్నారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భావోద్వేగమైన సంఘటనలు చూసామన్నారు.
Weather Update: రాగల 24 గంటల్లో వాతావరణంపై విశాఖ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన
కోదాడలో 450 మందిని ఏకకాలంలో రెస్క్యూ చేసినట్లు చెప్పారు. ఇలాంటి విపత్తు వస్తుందని గ్రహించి తమ సిబ్బందికి ఏడాది నుండి శిక్షణ ఇస్తున్నామన్నారు. వచ్చే రెండు రోజుల్లో నిర్మల్‌తో పాటు మరో రెండు జిల్లాలు ప్రమాదంలో ఉండే అవకాశం ఉందన్నారు. వచ్చే విపత్తును అంచనా వేసి తమ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. నేటితో ఖమ్మంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కేవలం రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటు ఫుడ్ మెడికల్ ఎమర్జెన్సీని కూడా చేరవేస్తుందన్నారు. సెల్ఫీల కోసం చాలామంది వరద ప్రాంతాలకు వస్తున్నట్లు గుర్తించామని.. ఖమ్మంలో సెల్ఫీల కోసం వచ్చిన వారి వల్ల ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్‌కు ఆటంకం కలిగిందని తెలిపారు. విపత్తుల సమయంలో ఎవరూ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కొని తెచ్చి పెట్టుకోవద్దని ఫైర్ డీజీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
AP Rains: వరద బాధితులకు అండగా వెంకయ్య నాయుడు.. భారీ విరాళం..
హమ్మయ్య.. తప్పిన గండం..
మరోవైపు 48 గంటలుగా పడుతున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు.. హైదరాబాద్ వాతావరణ శాఖ తీయటి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి వాన గండం తప్పింది. బంగాళాఖాతంలో వాయుగుండం పూర్తిగా బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. రాష్ట్రంలో నేడు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మంగళవారం నుంచి మాత్రం మోస్తరు వర్షాలు మాత్రమే రాష్ట్రంలో కురుస్తాయని భారీ ఊరటనిచ్చే వార్తను వాతావరణ శాఖ చెప్పింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వాసులకు కూడా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. భాగ్యనగరంలో ఇవాళ ఎలాంటి భారీ వర్షాల్లేవ్.. మోస్తరు వర్షం మాత్రమే నేడు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రానికి ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే.. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఖమ్మం జిల్లాకు మాత్రం భారీ వర్షం ముంపు లేకపోవడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి...
Viral Video: ఈ దొంగ మామూలోడు కాదు.. కళ్ల ముందే రూ.5 లక్షల బంగారాన్ని ఎలా కొట్టేశాడో చూడండి..
CM Revanth Reddy:సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరద బాధితులకు భరోసా
Read Latest Telangana News And Telugu News