Share News

Drugs: డ్రగ్స్‌‌కు బానిసైన సాఫ్ట్‌వేర్.. వెబ్‌ ద్వారా ఆర్డర్.. చివరకు..

ABN , Publish Date - Aug 10 , 2024 | 03:03 PM

Telangana: తెలంగాణ నార్కోటిక్ పోలీసుల డార్క్ వెబ్ ఆపరేషన్ నిర్వహించారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ను కస్టమర్లు ఆర్డర్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్‌కు బానిసగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను గుర్తించారు. జూలై 31న డార్క్ వెబ్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డ్రగ్స్‌ను ఆర్డర్ చేశాడు.

Drugs: డ్రగ్స్‌‌కు బానిసైన సాఫ్ట్‌వేర్.. వెబ్‌ ద్వారా ఆర్డర్.. చివరకు..
Telangana Narcotics Police

హైదరాబాద్, ఆగస్టు 10: సమాజంలో అనేక యువత డ్రగ్స్‌కు (Drugs) బానిస అవుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులు ఎన్నోరకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రకంగా డ్రగ్స్‌ సరఫరా జరుగుతూనే ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో (Hyderabad) పలుమార్లు భారీగా డ్రగ్స్‌ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌‌ను విక్రయిస్తున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ నార్కోటిక్ పోలీసుల (Telangana Narcotics Police) డార్క్ వెబ్ ఆపరేషన్ నిర్వహించారు.

Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ



డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ను కస్టమర్లు ఆర్డర్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్‌కు బానిసగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను గుర్తించారు. జూలై 31న డార్క్ వెబ్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డ్రగ్స్‌ను ఆర్డర్ చేశాడు. డ్రగ్స్ కోసం క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. అస్సాం నుంచి స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ అయ్యింది. న్యూస్ పేపర్‌లో డ్రగ్స్ చుట్టి ప్లాస్టర్ అంటించిన వైనాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈనెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు.

Visakha:12న నామినేషన్ వేస్తా..: మాజీ మంత్రి బొత్స


మరోవైపు హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డీఆర్‌ఐ అధికారులు డ్రగ్స్‌ను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాదాపు రూ.60 లక్షలు (అక్రమ మార్కెట్ విలువ) విలువ చేసే 3 కిలోల ఎఫెడ్రిన్/సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్యాకెట్ల నుంచి పొడి రూపంలో ఉన్న తెల్లటి పదార్ధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ టెస్ట్ కిట్‌తో పరీక్షించగా.. ఎఫెడ్రిన్/సూడోపెడ్రిన్‌ డ్రగ్ గుర్తించినట్లు అధికారలు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

BSNL: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు చుక్కలే..

TG News: ఇన్‌స్టా గ్రామ్‌ పరిచయమే శాపంగా మారి ఆ యువతిని...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2024 | 03:10 PM