Duvvada Sreenivas: వాణి, మాధురి గురించి షాకింగ్ విషయాలు చెప్పిన దువ్వాడ
ABN , Publish Date - Aug 10 , 2024 | 11:45 AM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఓ పెద్ద బర్నింగ్ టాపిక్‌గా మారింది. ఓ వైపు భార్య, కుమార్తెలు.. మరోవైపు మరో మహిళ మాధురి మీడియా ముందుకొచ్చి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రెండ్రోజులుగా దువ్వాడ కొత్త ఇంటి ముందే కూర్చొని కుమార్తెలు ఇద్దరూ నిరసన తెలుపుతున్నారు...
శ్రీకాకుళం/అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) వ్యవహారం ఓ పెద్ద బర్నింగ్ టాపిక్‌గా మారింది. ఓ వైపు భార్య, కుమార్తెలు.. మరోవైపు మరో మహిళ మాధురి మీడియా ముందుకొచ్చి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రెండ్రోజులుగా దువ్వాడ కొత్త ఇంటి ముందే కూర్చొని కుమార్తెలు ఇద్దరూ నిరసన తెలుపుతున్నారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం రాత్రి మొదలైన ఈ రచ్చ.. శుక్రవారం రాత్రి కూడా కంటిన్యూ అయ్యింది. ఈ మొత్తం వ్యవహారంపై అసలేం జరిగింది..? ఎందుకీ రాద్ధాంతం..? ఎవరీ మాధవి..? భార్య వాణి, కుమార్తెలు గురించి అన్నీ విషయాలపై మాట్లాడటానికి దువ్వాడ మీడియా ముందుకొచ్చేశారు.. ఆయన ఏం మాట్లాడుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నా కుటుంబం వీధిన పడింది!
మీడియాతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
25 ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నా
ఎన్నికల ముందు ఓ రాజకీయం..
ఎన్నికల తర్వాత మరో రాజకీయం నడుస్తోంది
రాజకీయమే జీవితంగా పనిచేస్తున్నా
నాకు పోలీస్ కేసులు కొత్త కాదు
విద్యార్థి దశ నుంచే నా జీవితంలో కేసులు భాగమయ్యాయి
కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయాలకు గౌరవించి..
అడుగుజాడల్లో నడిచే వారినే చూశా
కానీ నా కుటుంబ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది
మా కుటుంబం వీధిన పడింది
30 ఏళ్లుగా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నా
అధికారం ఉన్నా.. లేకున్నా.. ఒకే విధంగా పనిచేశా
నా కుటుంబానికి ఎలాంటి కష్టం కలగకుండా చూశా
నా సమస్యలను నా కుటుంబానికి ఎన్నడూ తాకనివ్వలేదు: దువ్వాడ
నలిగిపోతున్నా..!
నా కుటుంబం గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది
మా నాన్న సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేశారు
కుమార్తెలు ఇద్దరినీ డాక్టర్లను చేశా
పెద్ద కుమార్తెకు వివాహం చేశా
చిన్న కుమార్తెకు వివాహం చేయాల్సి ఉంది
ఇప్పుడు జరుగుతున్న హైడ్రామా మధ్య నలిగిపోతున్నా
అందరి తండ్రుల్లాగే నేనూ ఉన్నాను
నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది
నా భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ: దువ్వాడ శ్రీనివాస్
భార్య గురించి..!
నా భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ
వాణి నా గురించి పిల్లలకు చెడుగా చెప్పింది
నాపైనే నా కుమార్తెలు తిరగబడేలా వాణి ప్రోత్సహించింది
నా ఎదుగుదలకు వాణి అడుగడుగునా అడ్డుపడింది : దువ్వాడ శ్రీనివాస్
విడాకులు ఇప్పించాలని..!
నేను పుట్టుకతోనే శ్రీమంతుడిని కాను
నా దగ్గర డబ్బులు ఉన్న రోజులు ఉన్నాయి.. లేని రోజులూ ఉన్నాయి
నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఎప్పుడూ ఒకేలా ఉన్నా
అధిష్టానం దగ్గర కూడా టికెట్ కావాలని వాణి డిమాండ్ చేసింది
నాతో విడాకులు ఇప్పించాలని అధిష్టానాన్ని వాణి కోరింది
విడాకులు ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది
గెలుపోటములను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు
రాజకీయాల్లో తొలి నుంచీ నిజాయతీగా పనిచేశా
నా భార్యకు నేను ఎంతో గౌరవం ఇచ్చా
నన్ను ప్రతి సందర్భంలోనూ వాణి అవహేళన చేసింది
నా కుటుంబ సభ్యులను అగౌరవపరిచింది: దువ్వాడ శ్రీనివాస్
టార్చర్.. టార్చర్!
నేను జల్సాలకు డబ్బు ఎప్పుడూ ఉపయోగించలేదు
గ్రానైట్ వ్యాపారంలో వచ్చిన డబ్బు మొత్తం వాణికే ఇచ్చా
అధిష్టానంతో మాట్లాడి వాణికే టికెట్ ఇప్పించా
కుటుంబం పరువు రోడ్డున పడకూడదనే ప్రయత్నించా
కానీ చివరి నిమిషంలో అధిష్టానం నాకు టికెట్ కేటాయించింది
నాపై వాణి ఎప్పుడూ ఈర్ష్య, ద్వేషాలతోనే ఉండేది
మా అమ్మ, సోదరులకు నన్ను వాణి దూరం చేసింది
వాణి నన్ను ఎంతో టార్చర్ చేసింది: దువ్వాడ శ్రీనివాస్
అన్నం పెట్టని రోజులూ..!
నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది
కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి
వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ
ఓ కూతురు పెళ్లి చేశాను
మరో కూతురి పెళ్లి చేయాల్సిఉంది
మైన్‌ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేది
క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసేది
వాణి తన పేరిట ఆస్తులు రాయించాలని నిరంతరం వేధించేది
కోపంతో నాకు భోజనం పెట్టని సందర్భాలూ ఉన్నాయి: దువ్వాడ
మాధురితో పరిచయం ఎలా..?
పిల్లల గురించి తండ్రిగా నా బాధ్యత తెలుసు
కొన్నేళ్లు పోతే నేనేంటో పిల్లలకు అర్థమవుతుంది
ఇలా ఉంటే దేశంలో కుటుంబ వ్యవస్థ ఉండదు
నా భార్య నన్ను అమ్మకు దూరం చేసింది
అమ్మ దగ్గరకు వెళ్తే గొడవ పడుతుంది
నాకు సోదరులను దూరం చేసింది
గత ఎన్నికల్లో నాకు వ్యతిరేకంగా ఓటు వేయించారు
ఇంటి గేటును గునపాలతో పొడిచి ప్రవేశించారు
వాణినే నాకు దివ్వెల మాధురిని పరిచయం చేసింది
మాధురి సంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ
మాధురి రాజకీయంగా పనికొస్తుందని వాణి చెప్పింది
మాధురితో సంబంధం ఉందని ఆరోపణలు చేసింది
ఆరోపణలతో భర్త, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటోంది
మా వల్ల దివ్వెల మాధురి జీవితాన్ని కోల్పోయింది
ఓ రోజు హోటల్‌లో నన్నుదివ్వెల మాధురి కలిసింది..
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆత్మహత్యకు యత్నించింది
ఎలాగొలా దివ్వెల మాధురిని రక్షించాను
కుటుంబంలో విలువలేని పరిస్థితి..
భోజనం లేని పరిస్థితిని చూసి దివ్వెల దగ్గరయ్యాను
మేం బయటకు వెళ్లడం నిజమే.. ఆలయానికి వెళ్లింది కూడా నిజమే : దువ్వాడ శ్రీనివాస్
విడాకులిచ్చేస్తా!
దువ్వాడ వాణి.. మంత్రి అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లో ఉన్నారు
అచ్చన్న చెస్తున్నదంతా నాకు తెలుసు
సభ్యసమాజంలోనూ, జగన్ ముందు ద్రోహిగా నిలబెట్టి అవమానాలపాలు చేసారు
అందుకే విడాకులు ఇవ్వాలనుకుంటున్నా : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్