Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్‌లో ఈడీ సంచలన విషయాలు వెల్లడి..
ABN , Publish Date - Jun 03 , 2024 | 06:17 PM
ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్(ED Charge Sheet)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్రపై మే 10న పీఎంఎల్ఏ 44, 45సెక్షన్ల కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. తాజాగా దీన్ని స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో పలు అంశాలు బహిర్గతం అయ్యాయి.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ (ED Charge Sheet)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పాత్రపై మే 10న పీఎంఎల్ఏ 44, 45సెక్షన్ల కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. తాజాగా దీన్ని స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో పలు అంశాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే కవిత జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు మరోసారి కస్టడీని పొడిగించింది. జులై 3వ తేదీ వరకు నెల రోజులపాటు రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. సీబీఐ కేసులో జూన్ 7వరకు న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. ఆయితే జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.
ఈడీ ఛార్జ్ షీట్‌లో ఏం ఉందంటే..?
పీఎంఎల్ఏ సెక్షన్ 17ప్రకారం తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో 24చోట్ల సోదాలు చేసినట్లు ఈడీ ఛార్జ్ షీట్‌లో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో 18మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో శరత్ చంద్రా రెడ్డి, దినేష్ అరోరా, రాఘవ మాగుంట, రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రా, బినోయ్ బాబు, సంజీవ్ సింఘ్, వినోద్ చౌహాన్ బెయిల్‌పై ఉన్నారు. నిందితులు శరత్ చంద్రారెడ్డి ఏ7, రాఘవ మాగుంట ఏ18, A12గా అభిషేక్ బోయిన్పల్లి ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్లు50(2), (3)ప్రకారం కవిత, మాగుంట శ్రీనివాసులు, రాఘవ మాగుంట, గోపి కుమరన్, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా, అరుణ్ పిళ్లై, వి.శ్రీనివాస్ ఇతరుల వాంగ్మూలం రికార్డు చేసినట్లు ఛార్జ్ షీట్‌లో ఈడీ వెల్లడించింది.
ఈ కేసులో కవితతో సహా ఇప్పటివరకు మొత్తం 49మందిని విచారించామని ఈడీ తెలిపింది. ఇప్పటివరకు రూ.224కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు న్యాయస్థానానికి ఈడీ వెల్లడించింది. నేరానికి సంబంధించి విజయనాయర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. అరుణ్ పిళ్ళై, అభిషేక్ బోయినపల్లి హవాలా రూపంలో రూ.100కోట్లు తరలించారు. కిక్ బాక్ సొమ్మును తిరిగి సంపాదించుకునేందుకు క్రెడిట్ నోట్స్ జారీ చేశారు. పాలసీ రూపకల్పనలో విజయ్ నాయర్‌తో కలిసి కవిత సమావేశం అయ్యారు. కవిత తరఫున అరుణ్ పిళ్ళై, మాగుంట తరఫున ప్రేమ్ బినామీలుగా వ్యవహరించారు. కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిళ్ళై తన పేరుమీదే లాభాలు, పెట్టుబడులు చూపించారు. అందుకే కవిత ఖాతాలోకి అక్రమ సొమ్ము నేరుగా చేరలేదు. అమన్ దల్ సౌత్ గ్రూపునకు క్యాష్, క్రెడిట్ నోట్స్ రూపంలో నిధులు సమకూర్చారు. కవిత ఆదేశాల మేరకే ఆమె బంధువు వి.శ్రీనివాస్ కోటి రూపాయలు అరుణ్ పిళ్ళైకి అందించాడని ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.
For more Telangana news and Telugu news..