Kaleshwaram Project: కాళేశ్వరం విచారణ.. ఈఎన్‌సీపై ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Oct 23 , 2024 | 03:38 PM
Telangana: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ ఈఎన్‌సీ నాగేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈఎన్‌సీ సమాధానం ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
హైదరాబాద్, అక్టోబర్ 23: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) బహిరంగ విచారణ కొనసాగుతోంది. బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ ఈఎన్‌సీ నాగేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేందర్‌పై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు మూడు గంటల పాటు 130కి పైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి అయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌లో నిబంధనలు పాటించలేదని నాగేందర్ తెలిపారు.
Alapati Raja: జగన్ గుంటూరు పర్యటనపై ఆలపాటి రాజా షాకింగ్ కామెంట్స్
రామగుండం ఈఎన్‌సీ చేతిలోనే మూడు బ్యారేజీలు నడిచినట్లు కమిషన్ ముందు చెప్పారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే బ్యారేజీలలో లీకేజీలు జరిగాయా అని.. గేట్స్ ఆపరేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? నీళ్లను ఎవరు స్టోరేజ్ చేయమన్నారని కమిషన్ ప్రశ్నించింది. అలాగే వరదల సమయంలో గేట్లు ఓపెన్ చేయకూడదని ఎవరు ఆదేశించారని నాగేందర్‌ను క్వశ్చన్ చేసింది. పరిమితికి మించి మ్యారేజీలలో నీళ్లను స్టోర్ చేయమని ఎవరు ఆదేశించారని కమిషన్ అడిగింది. మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్ మాన్యువల్ ప్రిపేర్ చేసిందా అంటూ ఈఎన్‌సీ నాగేందర్‌ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది.
కమిషన్ ప్రశ్నలు.. నాగేందర్ సమాధానాలు
రామగుండం ఈఎన్‌సీ నిబంధనలు పాటించలేదని కమిషన్ ముందు ఈఎన్‌సీ నాగేందర్ చెప్పినట్లు తెలుస్తోంది. రామగుండం ఈఎన్‌సీ స్టేట్ అండ్ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదన్నట్లుగా కమిషన్ ముందు చెప్పారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే మూడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయా అని కమిషన్ ప్రశ్నించగా.. 2021 జనవరి వరకు ఆపరేషన్ సైన్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకమైన సిబ్బంది లేరని కమిషన్ ముందు నాగేందర్ తెలిపారు. 2021 జనవరిలో ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ టీం ఫామ్ అయిన తర్వాత రామగుండం ఈఎన్‌సీకి రిపోర్టు ఇచ్చామని తెలిపారు.
ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ పై ఎలాంటి యాక్షన్ రామగుండం ఈఎన్‌సీ తీసుకోలేదన్నారు. ఓ అండ్ ఎం ఇన్స్పెక్షన్ రిపోర్టును కమిషన్‌కు ఈఎన్‌సీ నాగేందర్ సబ్మిట్ చేశారు. సీడబ్ల్యుసీ మాన్యువల్ నిబంధనలు ఫాలో చేశారని కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఫాలో చేయలేదని నాగేందర్ సమాధానం ఇచ్చారు. ‘‘IS CODE పాటించారా?’’ అని అడుగగా.. లేదని ఆన్సర్ ఇచ్చారు. డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారని అధికారులను కాళేశ్వరం కమిషన్ అడిగింది. నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్ ఆపరేషన్స్ ప్రోటోకాల్ డ్యామ్ సేఫ్టీ ఆక్ట్ ఫాలో అయ్యారా అన్న ప్రశ్నకు కాలేదని నాగేందర్ సమాధానం చెప్పారు. వెథర్స్ షెడ్యూల్ ఫాలో అయ్యారా అని ప్రశ్నించగా.. దానికి కూడా కాలేదనే ఈఎన్సీ సమాధానం చేశారు. మూడు బ్యారేజీలలో నీళ్లను నిల్వ చేశారా అని కమిషన్ ప్రశ్నించగా.. 2019 నుంచి మూడు బ్యారేజీలలో పరిమితి నీళ్లను నిలువ చేసినట్లు కమిషన్ ముందు నాగేందర్ వెల్లడించారు. ప్రమాదం జరిగే ముందు ఓ అండ్ ఎం పరిశీలన చేశారా అని.. బ్యారేజీలలో నీళ్లను నిలువ చేయాలని ఎవరు? ఆదేశించారంటూ కమిషన్ అడిగిన క్వశ్చన్‌కు... రామగుండం ఈఎన్సీకి మౌకిక ఆదేశాలు ఉన్నాయి అన్నట్లుగా కమిషన్ ముందు ఈఎన్‌సీ నాగేందర్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి
Read Latest Telangana News And Telugu News