Share News

Hyderabad: నాగోల్‌లోని ఓ రెస్టారెంట్‌లో పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Nov 08 , 2024 | 03:29 PM

Telangana: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల డ్రైవ్ కొనసాగుతోంది. నాగోల్‌, ఎల్బీనగర్, ఉప్పల్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో శుక్రవారం అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లలో ఫుడ్‌ను తయారు చేస్తున్న విధానం, వాళ్లు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలను చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగోల్ లక్కీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Hyderabad: నాగోల్‌లోని ఓ రెస్టారెంట్‌లో పరిస్థితి చూస్తే..
Food safety Officials raid

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలో పలు రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. పలనా రెస్టారెంట్‌లో ఫుడ్ బాలేదని, అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్‌ను తయారు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తమై ఆయా రెస్టారెంట్లకు వెళ్లి మెరుపు దాడులు చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని చూస్తున్నారు. ఫిర్యాదులు వాస్తవమే అని నిర్ధారణ అయితే ఉన్న పలాన రెస్టారెంట్లను సీజ్ చేసేస్తున్నారు అధికారులు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత పాటించకపోవడం, నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న రెస్టారెంట్లు, హోటల్స్‌కు సంబంధించిన లైసెన్సులను రద్దు చేసేస్తున్నారు. తాజాగా నాగోల్ లక్కీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. అక్కడి పరిస్థితి చూసి షాకయ్యారు. ఇంతకీ రెస్టారెంట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

KA Paul: సుప్రీంకోర్టులో కేఏపాల్‌కు చుక్కెదురు


నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల డ్రైవ్ కొనసాగుతోంది. నాగోల్‌, ఎల్బీనగర్, ఉప్పల్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో శుక్రవారం అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లలో ఫుడ్‌ను తయారు చేస్తున్న విధానం, వాళ్లు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలను చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగోల్ లక్కీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాడైపోయిన ఫుడ్ సర్వ్ చేస్తున్నారని కస్టమర్ ఫిర్యాదు మేరకు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు. దాడుల్లో భాగంగా కిచెన్ అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. అంతేకాకుండా పాడైన పన్నీర్, క్యాబేజీ, చికెన్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రెస్టారెంట్‌ను నడుపుతున్నారంటూ.. రెస్టారెంట్‌ యజమానికి అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

YSRCP: శభాష్ జగన్.. అబద్ధాల్లో నెంబర్ వన్ అంటూ నెటిజన్ల కితాబు..


అలాగే ఎల్బీనగర్ మధురం రెస్టారెంట్‌లో చికెన్‌లో వెంట్రుక వచ్చిందని కస్టమర్ ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రెస్టారెంట్ కిచెన్‌ను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీ చేయగా.. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెస్టారెంట్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు ఉప్పల్ సురభి రెస్టారెంట్‌లోనూ అధికారులు దాడులు చేశారు. ఫుడ్‌లో బొద్దింక వచ్చిందనే కంప్లైంట్‌తో తనిఖీలు చేయడం జరిగింది. ఈ క్రమంలో రెస్టారెంట్‌లో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అనంతరం రెస్టారెంట్‌కు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రెస్టారెంట్లలో ఉపయోగించే ఆహార పదార్థాల విషయంలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, కిచెన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని.. లేని పక్షంలో చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Revanth Birthday: అదిరిపోయేలా రేవంత్ బర్త్‌డే కానుక.. మీరూ ఓ లుక్కేయండి

Telangana: తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 03:30 PM