Share News

Harish Rao: సర్కార్ తీరుతో రైతులకు కొత్త సమస్యలు షురూ...

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:06 AM

Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు రుణామాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి.. ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మండిపడ్డారు. ఏడు నెలల వడ్డీపై రైతులను బ్యాంకులు వేధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించిన రైతులకు అండగా నిలబడాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

Harish Rao: సర్కార్ తీరుతో రైతులకు కొత్త సమస్యలు షురూ...
Former Minister Harish Rao

హైదరాబాద్, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (BRS MLA Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి.. ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మండిపడ్డారు. ఏడు నెలల వడ్డీపై రైతులను బ్యాంకులు వేధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించిన రైతులకు అండగా నిలబడాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందిస్తూ.. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

YS Jagan: ఢిల్లీలో జగన్‌కు దారుణ అవమానం..


ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తనకు రైతులు పంపిన విజ్ఞప్తులను ప్రభుత్వ పరిశీలనకు పంపుతున్నానని... పరిష్కరించాలని కోరుతున్నట్లు హరీష్‌రావు ట్వీట్ చేశారు.

KCR: సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ


కాగా... కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రైతు రుణమాఫీని విడుదల చేసిన విషయం తెలిసిందే. లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేల కోట్లు జమ చేసింది. అలాగే ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణాబకాయిలను రైతుల తరపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే రైతు రుణమాఫీ అంశంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. లక్ష రూపాయల రుణాలు మాఫీ అని ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం మొత్తం రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఓ రైతులు లక్ష రూపాయల రుణం ఉండగా కేవలం మూడు వేలు మాత్రమే మాఫీ అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది.


ఇవి కూడా చదవండి...

Russo-Ukrainian War: ఇదేం బుద్ధి.. చనిపోయిన సైనికుల అవయవాలు అమ్ముకుంటున్న రష్యా?

Stock Markets: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాభాల స్టాక్స్!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 11:59 AM