Share News

Mandava Venkateshwar: దయచేసి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి.. సీఎం రేవంత్‌కు మండవ లేఖ

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:37 AM

Telangana: కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన అన్ని కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. కమ్మవారు చట్టపరంగా అగ్రవర్ణమే అయినా.. ఆ కులంలో మెజారిటీ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారన్నారు.

Mandava Venkateshwar: దయచేసి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి.. సీఎం రేవంత్‌కు మండవ లేఖ

హైదరాబాద్, మార్చి 14: కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు (Former Minister Mandava Venkateshwar Rao) లేఖ రాశారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన అన్ని కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. కమ్మవారు చట్టపరంగా అగ్రవర్ణమే అయినా.. ఆ కులంలో మెజారిటీ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారన్నారు. అగ్రవర్ణమైన కమ్మవారిలో కూడా ఆర్థికంగా వెనుకబడి, పూటగడవని వారు ఎందరో ఉన్నారని తెలిపారు. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక.. మెరిట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువులు ఆపేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక, స్వయం ఉపాధికి ఆర్థిక పరిస్థితి సహకరించక ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యం పేద కమ్మ వారిని ఆదుకునేందుకు మిగతా కులాల మాదిరిగానే “కమ్మ సంక్షేమ కార్పొరేషన్” ఏర్పాటు చేయాలని కోరారు. కమ్మవారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి ముఖ్యమంత్రిగా మీ పేరు ఉండిపోతుందన్నారు. తక్షణం కమ్మ కార్పోరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని మండవ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

TG News: యాదగిరిగుట్టలో పీటల వివాదంపై అధికారుల అలర్ట్

AP Govt: కక్ష కట్టిన జగన్ సర్కార్.. రాజధాని అమరావతిపై మరో భారీ కుట్ర


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2024 | 11:37 AM