Share News

Balka Suman: ఆయన స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం... హైడ్రా డ్రామాలు..

ABN , Publish Date - Sep 18 , 2024 | 03:56 PM

Telangana: ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం... హైడ్రా డ్రామాలు అంటూ విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీది ఒక విధానం... రేవంత్ రెడ్డికి ఇంకో విధానమా అని ప్రశ్నించారు.

Balka Suman: ఆయన  స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం... హైడ్రా డ్రామాలు..
Former MLA Balka Suman

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో దరిద్రపు పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Former MLA Balka Suman) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం... హైడ్రా డ్రామాలు అంటూ విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయన్నారు.

Congress: రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్


పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీది ఒక విధానం... రేవంత్ రెడ్డికి ఇంకో విధానమా అని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ దుయ్యబట్టారు. తమ్మడి కుంట ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్‌లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదని నిలదీశారు. నాగార్జునను రూ.400 కోట్లు డిమాండ్ చేశారని... ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు.

New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు


ప్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన నడుస్తలేదని... ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌తో పాటు తమ నాయకుల వ్యక్తిత్వాల మీద సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు పెడుతున్నారన్నారు. రేవంత్ టీమ్లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా తాను వదిలి పెట్టనని బాల్కసుమన్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

Ganesh Immersion: భారీగా నిలిచిపోయిన వినాయక విగ్రహాలు.. ఎంత వరకు బారులు తీరాయో తెలుసా..

CP Anand: భక్తులకు సీపీ ఆనంద్ విజ్ఞప్తి.. ఏ విషయంలో అంటే..


Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 03:58 PM