Viral: నా అందమే నా పాలిట శ్రతువుగా మారింది.. ఆవేదన వెళ్లగక్కిన హాట్ మోడల్..
ABN , Publish Date - Sep 18 , 2024 | 03:48 PM
అందంగా కనిపించడం కోసం హీరోయిన్లు, మోడళ్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏది పడితే అది తినకూడదు. తరచుగా కఠినమైన వర్కవుట్లు చేయాలి. అవి మాత్రమే చేస్తే సరిపోదు.. శరీరంలో అందంగా కనిపించని భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరి చేసుకోవాలి.
అందంగా (Beauty) కనిపించడం కోసం హీరోయిన్లు, మోడళ్లు (Models) పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏది పడితే అది తినకూడదు. తరచుగా కఠినమైన వర్కవుట్లు చేయాలి. అవి మాత్రమే చేస్తే సరిపోదు.. శరీరంలో అందంగా కనిపించని భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) ద్వారా సరి చేసుకోవాలి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొని అందాన్ని కాపాడుకుంటున్నా ఎన్నో సమస్యలు ఉంటాయని బ్రెజిల్‌కు చెందిన 35 ఏళ్ల మోడల్ జనైనా ప్రేజర్స్ (Janaina Prazeres) ఆవేదన వ్యక్తం చేసింది. గ్లామర్ ప్రపంచంలో పనిచేసే వ్యక్తులు ఆకర్షణీయంగా కనిపించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారని, ఈ ఒత్తిడి శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆమె తెలిపింది.
తన అందమే తనకు జైలుగా మారిందని జనైనా వాపోయింది. తాను ఇప్పటి వరకు ప్లాస్టిక్ సర్జరీ కోసం కోట్ల రూపాయలు వెచ్చించానని తెలిపింది. ``నేను చాలా పేరు, డబ్బు సంపాదించాను.. నా పట్ల ప్రజల ప్రవర్తన, వారి అంచనాలతో విసిగిపోయాను. నన్ను ప్రజలు ఓ వస్తువులా లేదా ఓ ట్రోఫీలా చూస్తారు. నాకూ ఓ మనసుంటుందనే విషయమే వారు గుర్తించరు. సాటి మహిళలతో స్నేహాన్ని కొనసాగించడం కూడా కష్టం. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్లు నన్ను చూసి ఆసూయపడుతుంటారు. నాతో కలిసి ఉండరు. ఇతరుల అంచనాలను అందుకోవడం కోసం ఎన్నో సార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నా`` అంటూ జనైనా పేర్కొంది.
జనైనా ఇప్పటి వరకు ఎన్నో సార్లు నోస్ జాబ్‌లు, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్, పక్కటెముకల తొలగింపు సహా చాలా ఆపరేషన్స్ చేయించుకుంది. గత 10 సంవత్సరాల్లో ప్రతి మూడు నెలలకోసారి బొటాక్స్, లిప్ ఫిల్లర్స్, బట్ ఫిల్లర్స్, చిన్ ఫిల్లర్స్, అండర్ ఐ ఫిల్లర్స్ వంటి బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది. ఈ ప్లాస్టిక్ సర్జీరీల కోసమే ఆమె ఇప్పటివరకు 8.53 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. మహిళలు అందం వల్ల కాకుండా తమ గుణాలు, బలాల ఆధారంగా గుర్తింపు తెచ్చుకుంటే మంచిదని జనైనా సూచించింది.
ఇవి కూడా చదవండి..
Viral: ఇదెక్కడి రూల్ నాయనా? బెంగళూరులోని ఆ మాల్‌లో రెస్ట్‌రూమ్ వాడుకోవాలంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..