Raghunandan: ఆ లోపంతోనే పటాన్‌చెరు అభివృద్ధి చెందలేదు
ABN , Publish Date - Feb 24 , 2024 | 12:15 PM
Telangana: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.
సంగారెడ్డి, ఫిబ్రవరి 24: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు (BJP Former MLA Raghunandan Rao) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు. 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యమైనా కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును ఇవ్వలేకపోవటం బాధాకరమన్నారు. స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ సర్వీస్ రోడ్డు నిర్మాణం పై లేదని మండిపడ్డారు. పటాన్ చెరులో గొప్ప లాండ్ బ్యాంకు ఉన్నా ఐటి సెజ్ అభివృద్ధి చేయలేదన్నారు. లక్డారంలో క్రషర్లు రూపంలో గుట్టలను, కొండలను కరిగించేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకే ప్రజలు పట్టం కడతారని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి