Share News

BRS vs Congress బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. మరో ఎమ్మెల్యే జంప్..

ABN , Publish Date - Jul 06 , 2024 | 01:13 PM

ఎన్నికల వేళ మాత్రమే కనిపించే నేతల కప్పదాట్లు.. ఇప్పుడు ఎన్నికల తరువాత కూడా కనిపిస్తోంది. తెలంగాణలో(Telangana) అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి వరుసగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

BRS vs Congress బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. మరో ఎమ్మెల్యే జంప్..
Gadwal BRS MLA Krishna Mohan Reddy

హైదరాబాద్, జులై 06: ఎన్నికల వేళ మాత్రమే కనిపించే నేతల కప్పదాట్లు.. ఇప్పుడు ఎన్నికల తరువాత కూడా కనిపిస్తోంది. తెలంగాణలో(Telangana) అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి వరుసగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ నేతల వ్యతిరేకత నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు ఊగిసలాడిన కృష్ణ మోహన్ రెడ్డి.. శనివారం నాడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ ఇద్దరూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


సరిత సైలెంట్ అయ్యేనా?

ఇదిలాఉంటే.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సరిత ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిత మాత్రమే కాదు.. ఇతర కాంగ్రెస్ నేతలు సైతం కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపైనే ఇటీవల గాంధీ భవన్ ఎదుట గద్వాల కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సరితను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని.. అన్ని విధాలుగా ఉంటామని పార్టీ అధిష్టానం ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి మోహన్ రెడ్డి చేరిక నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.

Congress-Protest.jpg


మరో ఆరుగురు రెడీ..?

అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరగా.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం చేరికల పర్వం జోరందుకుంది. బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ ఆ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 10 మంది వరకు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు కూడా రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.

BRS-vs-Congress.jpg


బీఆర్ఎస్ అగ్రనేతల ఆగ్రహం..

పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్‌ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపైనా.. ఆ పార్టీలో చేరుతున్న బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన కాంగ్రెస్‌లో చేరుతున్న నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


Also Read:

లవర్ కోసం వెళ్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్

నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా.. కారణం అదే

మనుమళ్లు, మనుమరాళ్లతో ముకేష్, నీతా అంబానీల సంగీత్ సందడి

For More Telangana News and Telugu News..

Updated Date - Jul 06 , 2024 | 01:13 PM