Share News

Hyderabad: బాబోయ్ దారుణం.. అక్కడ దొరికింది చూసి కంగుతిన్న మేయర్ విజయలక్ష్మి..

ABN , Publish Date - Nov 13 , 2024 | 08:25 PM

హైదరాబాద్‌లో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కల్తీ ఆహారాన్ని గుర్తించారు. కుళ్లిన మాసం, అపరిశుభ్ర వాతావరణం కలిగిన వంట గదుల నిర్వహణ విషయంలో ఆమె యాజమాన్యంపై మండిపడ్డారు.

Hyderabad: బాబోయ్ దారుణం.. అక్కడ దొరికింది చూసి కంగుతిన్న మేయర్ విజయలక్ష్మి..
GHMC Mayor Gadwala Vijayalakshmi

హైదరాబాద్: కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హెచ్చరించారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో విజయలక్ష్మి ఇవాళ (బుధవారం) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన మాంసం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం అందిస్తున్న రెస్టారెంట్ల యజమానులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఆహార భద్రతా అధికారులతో కలిసి ఖైరతాబాద్ మొఘల్ రెస్టారెంట్‌లో మేయర్ విజయలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. కిచ్చెన్, వాష్ ఏరియా అపరిశుభ్రంగా ఉన్నట్లు మేయర్ గుర్తించారు. అలాగే కిచెన్‌లో ప్రిజర్వ్ చేసిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. హోటల్ నిర్వాహణ తీరు విషయంలో యజమానులపై విజయలక్ష్మి ఫైర్ అయ్యారు. మేయర్ ఆదేశాల మేరకు అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. అలాగే ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు. మరోవైపు ఫుడ్ కలర్ వినియోగంపైనా హోటల్ నిర్వాహకులను ఆమె ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాడం ఆడితే సహించేది లేదని యాజమాన్యాన్ని హెచ్చరించారు.


అలాగే బంజారాహిల్స్ డైన్ హిల్ మండి రెస్టారెంట్‌ను మేయర్ గద్వాల విజయలక్ష్మి తనిఖీ చేశారు. కిచెన్ హైజినిక్‌గా లేకపోవడం గుర్తించి నిర్వాహకులపై మేయర్ సీరియస్ అయ్యారు. ఆ రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ ముగిసిపోయినప్పటికీ పునరుద్ధరించకుండా అలాగే నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన కుళ్లిన మాంసాన్ని గుర్తించి నిర్వహకులపై మేయర్ మండిపడ్డారు. కొన్ని శ్యాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిన మాంసంపై మేయర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు ఏమాత్రం అమోదయోగ్యం కాదని ఆమె ఆగ్రహించారు.


తనిఖీల అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులతో మేయర్ విజయలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఇకపై రెగ్యులర్‌గా హోటళ్లు, రెస్టారెంట్లు తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వారానికి కనీసం 15 హోటళ్లు లేదా రెస్టారెంట్లు తనిఖీలు చేయాలని మేయర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్‌పై ఫోకస్ చేయాలని ఆమె సూచించారు. ట్రేడ్, ఫుడ్ లైసెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Vikarabad: అభివృద్ధి చేస్తామంటే అల్లరి మూకలతో దాడులా: తిరుపతి రెడ్డి

Minister Ponguleti: తెలంగాణ నూతన ఆర్‌ఓ‌ఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి పొంగులేటి..

Updated Date - Nov 13 , 2024 | 09:00 PM