IPL: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే..
ABN , Publish Date - Mar 27 , 2024 | 01:16 PM
ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళుతున్న వారికి గుడ్ న్యూస్. మ్యాచ్ ఆలస్యమైంది.. ఇంటికి వెళ్లడమెలా? ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే.. నైట్ టైమ్ కాబట్టి వందలకు వందలు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైల్ సమయాన్ని పొడిగించనున్నారు.
హైదరాబాద్: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ (IPL Match) చూసేందుకు వెళుతున్న వారికి గుడ్ న్యూస్. మ్యాచ్ ఆలస్యమైంది.. ఇంటికి వెళ్లడమెలా? ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే.. నైట్ టైమ్ కాబట్టి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైల్ సమయాన్ని పొడిగించనున్నారు. అర్ధరాత్రి 12:15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయని తెలిపారు. తెల్లవారుజామున 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. నాగోల్ (Nagole), ఉప్పల్, స్టేడియం, ఎన్‌జిఆర్‌ఐ (NGRI) స్టేషన్‌లలో మాత్రమే షెడ్యూల్ గంటల తర్వాత ప్రవేశానికి అనుమతి ఉంది. ఇతర స్టేషన్లలో మాత్రమే ఎగ్జిట్‌లు అందుబాటులో ఉంటాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
MLA Malla Reddy: ఓటు అడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు: మల్లారెడ్డి
ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో బుధవారం జరగనున్న ఐపీఎల్-2024 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మ్యాచ్‌కి 2500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి(Rachakonda Commissioner Tarun Joshi) వెల్లడించారు. ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనున్నట్లు తెలిపారు. స్టేడియాన్ని మంగళవారం నుంచే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బందితో పాటు డీసీపీలు, ఏసీపీలు నేరుగా స్టేడియంలో తిరుగుతూ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సీపీ తెలిపారు. ప్రత్యేకంగా 360 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఐటీ సెల్ అధికారులు మానిటరింగ్ చేస్తారు. మహిళలకు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా, పోకిరీలు, ఆకతాయిలు వేధించకుండా షీటీమ్ బృందాలను మఫ్టీలో ఉంటారన్నారు.
KTR: ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.