Beerla Ilaiah: హరీష్, కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్ ఫైర్
ABN , Publish Date - Sep 23 , 2024 | 02:53 PM
Telangana: గత పదేళ్లలో.. పాలనలో కల్తీ, పాలల్లో కల్తీ అంటూ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ ఎక్కడ పన్నడు అని ప్రశ్నించారు. హరీష్, కేటీఆర్‌కు సిగ్గు శరం ఉండాలంటూ మండిపడ్డారు. కేసీఆర్ రైతులను ముంచారని..
హైదరాబాద్, సెప్టెంబర్ 23: మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రామారావు డ్రామాలు ఆపేయాలన్నారు. గత పదేళ్లలో.. పాలనలో కల్తీ, పాలల్లో కల్తీ అంటూ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ ఎక్కడ పన్నడు అని ప్రశ్నించారు. హరీష్, కేటీఆర్‌కు సిగ్గు శరం ఉండాలంటూ మండిపడ్డారు. కేసీఆర్ రైతులను ముంచారని.. హరీష్ డెయిరీలను నాశనం చేశారని విమర్శించారు.
Krishnarao: హైడ్రా కూల్చివేతలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం బావబామ్మర్ధులు కొట్టుకుంటున్నారన్నారు. కేటీఆర్ కమిటీ వేయడం సిగ్గుమాలిన పని అంటూ దుయ్యబట్టారు. ప్రజాపాలనకి వస్తున్న ఆదరణ చూసి రంగా, బిల్లాలు ఓర్వలేకపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నట్టు, కేటీఆర్ మంత్రిగా ఉన్నట్టు భావిస్తున్నారు’’ అని అన్నారు. గాంధీ హాస్పిటల్ సిబ్బంది మనోధైర్యం దెబ్బతీసేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. పదేండ్లలో ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ గురించి ఆలోచించారా అని నిలదీశారు.
డీప్యూటీ సీఎం గా ఉంటే ఓర్వలేని రాజయ్య ఈరోజు అవసరం వచ్చారా అని అడిగారు. పదేండ్లలో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయారంటూ మరో ప్రశ్న సంధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారన్నారు. విజయ డెయిరీని, మదర్ డెయిరీని గత పదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. గత పదేళ్లలో డెయిరీల్లో బీఆర్ఎస్ నాయకులు పంది కొక్కుల్లా మెక్కారని ఆరోపించారు. డెయిరీలపై జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. నకిలీ పాలు తెచ్చి విజయ డెయిరీ, మదర్ డెయిరీని నాశనం చేశారన్నారు. హరీష్ తన భార్య పేరుతో డెయిరీ పెట్టి విజయ, మదర్ డెయిరీలను ఆగం పట్టించారని విమర్శించారు. రాజయ్యకి బీఫాం ఇవ్వలేదని. దళితుడ్ని ముందట పెట్టి డ్రామా చేస్తున్నారని.. రాజకీయ లబ్ధి కోసమే కమిటీలు అంటూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విరుచుకుపడ్డారు.
YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..
త్రిసభ్య కమిటీ.. హౌస్ అరెస్ట్
కాగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు గాంధీ ఆస్పత్రికి బీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే సంజయ్, మెతుకు ఆనంద్ వెళ్లాల్సింది. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు కమిటీ మెంబర్స్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. తమను పోలీసులు అడ్డుకుంటున్నారని, హౌజ్ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. త్రిసభ్య కమిటీలో ఆనంద్ సభ్యుడిగా ఉన్నారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లనీయకుండా ఆనంద్‌ను పోలీసులు ఇంట్లోనే ఉంచారు. విషయం తెలిసిన కార్యకర్తలు భారీగా ఆనంద్ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఇంట్లోకి పోలీసులు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డంగా కూర్చున్నారు. మరోవైపు ఆనంద్ ఇంటి చుట్టూ పోలీసులు పహారాకాస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Tirumala: తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం
KTR: బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
Read latest Telangana News And Telugu News