Share News

Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్

ABN , Publish Date - Sep 30 , 2024 | 10:36 AM

Telangana: మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన 1962 -పశువైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమని హరీష్ రావు అన్నారు.

Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్
Former Minister Harisha Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 30: 1962 అంబులెన్స్ సేవల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గత ఆరు నెలలుగా వేతననాలు అందంచకపోవడం పట్ల మాజీమంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former Minister K.Chandrashekar Rao) ప్రారంభించిన 1962 -పశువైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు.

Telangana Tourism: తక్కువ బడ్జెట్‌తో వీకెండ్ ట్రిప్.. తెలంగాణ మినీ మాల్దీవులు బెస్ట్



కేంద్ర ప్రభుత్వ (Centra Govt) ప్రశంసలు కూడా పొంది దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన గొప్ప కార్యక్రమ నిర్వహణను గాలికి వదిలేసి మూగజీవుల రోదనకు కారణమవుతోందని విమర్శించారు. ఒకవైపు వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతుండగా... మరోవైపు వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారన్నారు. కుటుంబ పోషణ భారంగా మారి ఆవేదన చెందుతున్నారని తెలిపారు.


ప్రభుత్వం వెంటనే స్పందించి 1962 వాహనాల్లో మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఉద్యోగ సిబ్బందికి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే హరీష్‌ రావు డిమాండ్ చేశారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై విచారణ


కాగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) 100 అత్యాధునిక మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లతో (ఎంవీఎస్) పీఏఎస్ సేవలను 15 సెప్టెంబర్ 2017న అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఒక్కో గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంవీసీని ఏర్పాటు చేశారు. మే 2021 వరకు 19.26 లక్షలకుపైగా జంతు అత్యవసర పరిస్థితులకు హాజరయ్యారు. మొబైల్ వెటర్నరీ సర్వీసెస్ ప్రాజెక్ట్ అంటే పశువులకు అత్యవసరంగా చికిత్స అవసరం అయినప్పుడు ఇంటి వద్దకే వచ్చి చికిత్సను అందించడం. జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, జంతువు ఉత్పాదకతను పెంచడంలో ఎంవీఎస్ సహాయపడుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.


ఇవి కూడా చదవండి...

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై విచారణ

ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2024 | 10:37 AM