BRS: నాలుగు నెలలుగా వారికి జీతాలు లేవు: హరీష్ రావు
ABN , Publish Date - May 21 , 2024 | 10:23 AM
హైదరాబాద్: కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల (Nursing Officers)కు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలు (4 Months Salaries) ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను కాంగ్రెస్ (Congress) తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసిందని విమర్శించారు.
వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని, దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని హరీష్ రావు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్
హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి
ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News