Share News

Harish Rao: మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు

ABN , Publish Date - Nov 04 , 2024 | 09:25 AM

మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని హరీష్‌రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు.

Harish Rao: మాజీ  సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు

హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్‌రావు (Ex Minister Harish Rao), రేవంత్ రెడ్డి సర్కార్‌పై (Revanth Reddy Govt.,) ఎక్స్ (X) వేదికగా తీవ్ర విమర్శలు (Comments) చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు.

మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని హరీష్‌రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు అన్నారు.


కాగా రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి పాలనలో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని కోల్పోయిందని తెలిపారు. వరి కోతలు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పుటికీ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌ను వీడి జిల్లాల్లో పర్యటించి రైతుల బాధలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హరీశ్‌రావు హెచ్చరించారు.

60మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైతే చీమ కుట్టినట్టు లేదా..

గురుకుల పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైతే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటనపై ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. విద్యార్థులకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

నా ఆత్మహత్య వెనుక అసలు కారణాలు డిప్యూటీ సీఎంకు తెలియాలి..

బాలుర మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 04 , 2024 | 09:25 AM