Share News

Harish Rao: రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్.. హరీష్‌రావు విసుర్లు

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:25 PM

100 రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిగా ఎందుకు అమలు చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‌హరీష్‌రావు ప్రశ్నించారు. డిసెంబర్ 9న రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని మోసం చేశారని హరీష్‌రావు అన్నారు. కేసీఆర్ సీఎం కాగానే మొదటి నెలలోనే రూ 2 వేల పింఛన్ ఇచ్చారని హరీష్‌రావు గుర్తుచేశారు.

Harish Rao: రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్.. హరీష్‌రావు విసుర్లు

మెదక్ జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు మంచిపాలన అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‌హరీష్‌రావు కోరారు. సీఎం రేవంత్ రాష్ట్రానికి మేలు చేస్తున్నారో.. కీడు చేస్తున్నారోప్రజలు ఆలోచించాలని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే రేవంత్‌రెడ్డి పని చేయాలని హితవు పలికారు. సీఎం పదవిని అడ్డం పెట్టుకొని రేవంత్‌రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.


ALSO READ: Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు...

రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్‌రెడ్డి లాగా వ్యవహరించలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో హరీష్‌రావు ఈరోజు(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... ప్రజాపాలన ప్రసంగంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడారని హరీష్‌రావు అన్నారు. ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టించేందుకు బురద జల్లుతున్నారని హరీష్‌రావు ఆరోపణలు చేశారు. 100 రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.


ALSO READ: Dana Nagender: తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే హైడ్రా..

రుణమాఫీపై మోసం...

డిసెంబర్9న రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని మోసం చేశారని హరీష్‌రావు అన్నారు. కేసీఆర్ సీఎం కాగానే మొదటి నెలలోనే రూ.2 వేల పింఛన్ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 2024 మార్చి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులను.. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న అప్పు రూ 4.26 లక్షల కోట్లు అని తానే గతంలో చెప్పానని హరీష్‌రావు గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో రూ .7 లక్షల అప్పు రాష్ట్రంపై ఉందని చెబుతున్నారని హరీష్‌రావు అన్నారు.


ALSO READ: KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

హామీల అమల్లో విఫలం..

నేడు రాష్ట్రం దివాళా అంటూ తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీస్తే నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడుతావు’ అని హరీష్‌రావు హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్ కంటే నీకు రాజకీయాలే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్‌ను తిట్టడమే సీఎం రేవంత్ పరమావధిగా పెట్టుకున్నారని హరీష్‌రావు విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టలల్లో విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతున్నారని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.


ALSO READ: CP Anand: గతేడాదిలా కాకుండా త్వరగానే గణేష్ నిమజ్జనానికి చర్యలు..

అమరుల ఆత్మ ఘోషిస్తోంది..

జై తెలంగాణ అననోళ్లు.. అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారని.. దీంతో తెలంగాణ అమరుల ఆత్మ ఘోషిస్తోందని అన్నారు. 2013 -14 లో రూ. 1,43,739 తలసరి ఆదాయం ఉండేదని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ 3,47,221 పెరిగిందని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం రూ.4,51,580 కోట్లు ఉంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 14,63,9,63 లక్షలకు పెరిగిందని హరీష్‌రావు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2024 | 03:44 PM