Harish RAO: దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు మరిచారు.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం
ABN , Publish Date - Oct 29 , 2024 | 05:04 PM
రాష్ట్రంలో ప్రజాపాలన కాదు..పోలీసు పాలన సాగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌కు పాలన మీద పట్టు లేదన్నారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్ రాక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కరెంట్ బిల్లులు పెరగలేదని హరీష్‌రావు చెప్పారు.
వనపర్తి: అక్రమ కేసులు పెడుతూ కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని.. వారి పేర్లు డైరీల్లో రాసిపెడుతున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణలో కొత్తపథకాలు అటుంచి పాత పథకాలను కూడా సీఎం రేవంతరెడ్డి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే సోయి రేవంత్ ప్రభుత్వానికి లేదని హరీష్‌రావు విమర్శించారు.
రుణమాఫీకి ఎగనామం..
తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. అనేక కొర్రీలు పెట్టి రేవంత్ ప్రభుత్వం రుణమాఫీకి ఎగనామం పెడుతోందని మండిపడ్డారు. ఇవాళ(మంగళవారం) వనపర్తిలో హరీష్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ... దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు మరిచారని మండిపడ్డారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టిన పాలకుడు.. ఇచ్చిన మాట తప్పితే తెలంగాణకే అరిష్టమని అన్నారు. ఎనముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగ వేతల రేవంత్ రెడ్డి అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీలు నెరవేర్చేవరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు..లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణకు డబ్బులిచ్చే సీఎం రేవంత్‌రెడ్డికు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు నిధులు లేవా అని హరీష్‌రావు నిలదీశారు.
నిరుద్యోగులకు తీవ్ర నష్టం..
రైతుబంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీని ఉరికించాలని హరీష్‌రావు హెచ్చరించారు. పత్తిరైతులకు మద్దతు ధర లేక రైతులు అవస్ధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డెడ్‌లైన్లు మారాయి.. పత్రికల్లో హెడ్‌లైన్లు మారాయి..కానీ రైతు రుణమాఫీ మాత్రం ఓ లైనుకు రాలేదని విమర్శించారు. సర్కార్ ధవఖానాల్లో మందులు కూడా లేవని చెప్పారు. జీఓ నెంబర్29తో నిరుపేద నిరుద్యోగులకు తీవ్ర నష్ట కలుగుతోందని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజాపాలన కాదు..పోలీసు పాలన సాగుతోందని హరీష్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌కు పాలన మీద పట్టు లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే తెలంగానలో కరెంట్ బిల్లులు పెరగలేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ ప్రభుత్వం మెడలు వంచుతామని హరీష్‌రావు వార్నింగ్ ఇచ్చారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల బాకీ పడిందని అన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం జరుగుతుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy:రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
Formula E Racing: తెలంగాణలో వెలుగులోకి మరో స్కామ్.. ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు
TG NEWS: నకిలీ పత్రాలతో ల్యాండ్ కబ్జా... పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్
Babumohan: టీడీపీ గూటికి బాబుమోహన్
Bandi Sanjay: కేసీఆర్ కుటుంబంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News