Share News

TG News: హైదరాబాద్‌లో భారీగా గంజాయి ఆయిల్ పట్టివేత

ABN , Publish Date - Aug 15 , 2024 | 02:09 PM

Telangana: రాష్ట్ర పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ నగరంలో అప్పుడప్పుడూ డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. డ్రగ్స్, గంజాయి అమ్ముతూనో, కొనుగోలు చేస్తూనో అనేక మంది పోలీసులకు చిక్కారు. దీంతో మరో రకంగా గంజాయి విక్రయానికి తెరతీశారు కేటుగాళ్లు. డ్రగ్స్, గంజాయి కామన్ అనుకున్న వారు.. తాజాగా ఆయిల్ రూపంలో గంజాయిని విక్రయించేందుకు యత్నించి కటకటకాలపాలయ్యారు.

TG News:  హైదరాబాద్‌లో భారీగా గంజాయి ఆయిల్ పట్టివేత
Ganja Oil

హైదరాబాద్, ఆగస్టు 15: రాష్ట్ర పోలీసులు (Telangana Police) ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ నగరంలో అప్పుడప్పుడూ డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. డ్రగ్స్, గంజాయి అమ్ముతూనో, కొనుగోలు చేస్తూనో అనేక మంది పోలీసులకు చిక్కారు. దీంతో మరో రకంగా గంజాయి విక్రయానికి తెరతీశారు కేటుగాళ్లు. డ్రగ్స్, గంజాయి కామన్ అనుకున్న వారు.. తాజాగా ఆయిల్ రూపంలో గంజాయిని విక్రయించేందుకు యత్నించి కటకటకాలపాలయ్యారు. నగరంలో భారీగా గంజాయి ఆయిల్ పట్టుబడింది. నాంపల్లిలో 8 లక్షలు విలువైన 1.5200 కేజీల ఆయిల్‌‌ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు.

Rahul Gandhi: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్‌కు అవమానం!


ఇన్ని రోజులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు చేస్తూ పట్టబడగా.. తాజాగా గంజాయి ఆయిల్ అమ్మకందారులు పట్టుబడుతున్నారు. గంజాయి పూలు పలాల నుంచి అతి విలువైన గంజాయి వీడ్ ఆయిల్ తయారుచేస్తున్నారు. ఏపీ రాష్ట్రం అరకు నుంచి తెచ్చి హైదరాబాద్‌లో గంజాయి ఆయిల్‌ను అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులకు 203 గంజాయి ఆయిల్ బాక్సులను పట్టుకున్నారు. ఒక్కొక్క బాక్సులో 7.5 ఎంఎల్ గంజాయి ఆయిల్ ఉంది. మొత్తం 1.5200 కేజీల గంజాయి ఆయిల్‌ను అధికారులు సీజ్ చేశారు. రెండు బైకుల ద్వారా సరఫరా చేస్తున్న కూకట్‌పల్లికి చెందిన జయచందర్, నిజాంపేట్‌కు చెందిన రాజేష్, కుత్బుళ్లపూర్‌కు చెందిన కట్ట చింటూలను అధికారులు అరెస్ట్ చేశారు.

Chandrababu: అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించి.. అక్కడే భోజనం చేసిన చంద్రబాబు దంపతులు



ఇటీవల నగరంలోని హయత్‌నగర్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి బెంగుళూరు వయా హైదరాబాద్ మీదుగా హాష్ ఆయిల్‌ను ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు కోటి రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 13.5 హాషిష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. 13.5 హాషిష్ తయారు చేయాలంటే 600 కేజీల గంజాయి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఏపీకి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Kotha Prabhakar: దుబ్బాక అభివృద్ధిపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2024 | 02:13 PM