Share News

TG NEWS: టవరెక్కిన మాజీ హోంగార్డు.. ఎందుకంటే

ABN , Publish Date - Dec 21 , 2024 | 09:06 AM

ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా తమను విధుల్లో నుంచి తీసివేశారని.. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు ఆందోళనకు దిగారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వద్ద సెల్‌ఫోన్ టవరెక్కి నిరసనకు దిగారు.

TG NEWS: టవరెక్కిన మాజీ హోంగార్డు.. ఎందుకంటే

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వద్ద మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు హల్‌చల్ చేశారు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని సెల్‌ఫోన్ టవరెక్కి మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు ఇవాళ(శనివారం) ఆందోళనకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా 250మంది హోమ్ గార్డులను తొలగించినందుకు టవర్ ఎక్కి హోంగార్డు నిరసన తెలిపాడు. 10సంవత్సరాల పాటు విధులు నిర్వహించామని అన్నారు. అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్‌లలో విధులు నిర్వహించినట్లు చెప్పారు.


అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం తమపై కక్షగట్టి విధుల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గుర్తింపుగా సర్టిఫికెట్స్, బాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ ఉన్నాయనే తెలిపారు. అధికారంలోకి రాగానే తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సంవత్సరం గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పలు పోలీస్టేషన్లలో విధులు నిర్వహించానని ఆంజనేయులు వివరించారు. తమ గురించి అస్సాంబ్లీలో చర్చించి తొలగించిన 250మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకొని తమను ఆదుకోవాలని వీరంజనేయులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు

MahaKumbh Mela: మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు

Neethu Bai: ఈ కిలాడీ లేడి.. మహా ముదురు.. టార్గెట్ ఫిక్స్ చేస్తే ...

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 21 , 2024 | 09:07 AM