Crime News: ఉప్పల్ భగాయత్‌లో పోకిరీలతో చేతులు కలిపిన ఎస్సై.. చివరికి ఏమైందంటే?
ABN , Publish Date - Jun 22 , 2024 | 05:11 PM
ఉప్పల్ భగాయత్(Uppal Bhagayat)లో పోకిరీల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందుతులను శిక్షించాల్సిన ఎస్సై వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతణ్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
హైదరాబాద్: ఉప్పల్ భగాయత్(Uppal Bhagayat)లో పోకిరీల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. రాత్రివేళ భగాయత్‌కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందుతులను శిక్షించాల్సిన ఎస్సై వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతణ్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
అసలేం జరిగిందంటే?
తాజాగా ఓ ప్రేమజంట ఉప్పల్ భగాయత్‌కు వెళ్లారు. వారిని చూసిన పోకిరీలు రెచ్చిపోయారు. రూ.3లక్షలు ఇవ్వాలంటూ లేదంటే తమ వ్యవహారం భయటపెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు స్థానిక ఎస్సైను కలిసి పోకిరీలపై ఫిర్యాదు చేశారు. అయితే నిందితులతో చేతులు కలిపిన ఎస్సై కాంప్రమైజ్ కావాలంటూ ప్రేమికులను డిమాండ్ చేశారు. దీనిపై వారు ఉన్నతాధికారులను కలిసి విషయాన్ని వివరించారు. ఘటనపై ఆగ్రహించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నలుగురు పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైను డీసీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి:
CM Revanth Reddy: తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్