Hyderabad: బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్.. కారణమిదేనట..!
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:29 PM
ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహిళా డాక్టర్ డిప్రెషన్‌తో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పండింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Nagole Police Station) చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్ రావు నగర్‌కు(AS Rao Nagar) చెందిన కాకర్ల నాగేశ్వరావు కొంతకాలం క్రితం..
హైదారబాద్, జులై 05: ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహిళా డాక్టర్ డిప్రెషన్‌తో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పండింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Nagole Police Station) చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్ రావు నగర్‌కు(AS Rao Nagar) చెందిన కాకర్ల నాగేశ్వరావు కొంతకాలం క్రితం నాగోలు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ సహభవన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.
Also Read: పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!
ఆయన కూతురు నిహారికరావు(29)ను రెండేళ్ల క్రితం డాక్టర్ మనోహర్షతో వివాహం చేశారు. ప్రస్తుతం మనోహర్ష ఢిల్లీలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. నిహారికరావు ఎంబీబీఎస్ పూర్తి చేసి, తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఎంబీబీఎస్ పీజీ పరీక్షల కోసం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో నిహారికరావు ఇటీవల మానసికంగా డిప్రెషన్‌కు గురై, చికిత్స తీసుకుంటుంది. ఆమెకు తోడుగా తల్లి నిరంతరం వెంట ఉంటుంది.
Also Read: సీటెట్ హాల్ టికెట్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
అయితే, గురువారం రాజీవ్ స్వగృహ సహభవన అపార్ట్‌మెంట్‌లో 8వ అంతస్తు పైనుంచి దూకి నిహారికరావు ఆత్మహత్యకు పాల్పడింది. పైనుంచి దూకడంతో పార్కింగ్ చేసిన కారు అద్దంపై పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు.. ఆమెను వెంటనే ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. కానీ, నిహారిక అప్పటికే చినపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని పోలీసులకు సైతం తెలియజేయడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మానసికంగా డిప్రెషన్‌తో బాధపడుతూ తన కూతురు నిహారిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. గతంలోనూ నిహారిక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.