Share News

Hyderabad: అల్లు అర్జున్ అరెస్టుపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పోలీసులు..

ABN , Publish Date - Dec 13 , 2024 | 09:45 PM

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు తదితర వివరాలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు పోలీస్ బందోబస్తు కోరిన నాటి నుంచి నేటి(శుక్రవారం) వరకూ జరిగిన పరిణామాలను వివరిస్తూ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్, హైదరాబాద్ సిటీ పేరిట ఓ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది.

Hyderabad: అల్లు అర్జున్ అరెస్టుపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పోలీసులు..

హైదరాబాద్: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు తదితర వివరాలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు పోలీస్ బందోబస్తు కోరిన నాటి నుంచి నేటి(శుక్రవారం) వరకూ జరిగిన పరిణామాలను వివరిస్తూ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్, హైదరాబాద్ సిటీ పేరిట ఓ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. ఇందులో 04 డిసెంబర్, 2024 నాటి ఘటన, అలాగే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు స్పష్టంగా వివరించారు.


లేఖలో ఏముందంటే..

"కొంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు మతపరమైన లేదా ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో బందోబస్తు కావాలంటూ మాకు చాలా అభ్యర్థనలు అందుతున్నాయి. అయినప్పటికీ ప్రతి ఈవెంట్‌కు బందోబస్తు అందించడం మా వనరులకు మించిన పని. కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నా లేదా ప్రముఖ వ్యక్తి కార్యక్రమానికి వస్తున్నా ఈవెంట్ ఆర్గనైజర్ వ్యక్తిగతంగా ఏసీపీ లేదా డీసీపీ కార్యాలయాన్ని సందర్శించి బందోబస్తు కోరాల్సి ఉంటుంది. అయితే పుష్ప-2 విడుదలకు సంబంధించి 04 డిసెంబర్, 2024న బందోబస్తు కోరుతూ సంధ్యా సినీ ఎంటర్‌ప్రైజ్ 70 ఎంఎం చిక్కడపల్లికి లేఖ పంపింది.


ఈ సందర్భంలో నిర్వాహకుడు ఏ అధికారినీ నేరుగా కలవలేదు, కేవలం ఇన్‌వర్డ్ విభాగంలో లేఖ సమర్పించారు. థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులకు ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. నటుడు అల్లు అర్జున్ వచ్చే వరకూ ప్రేక్షకులు బాగానే ఉన్నారు. థియేటర్ వద్దకు వచ్చిన అర్జున్ వాహనం సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి పెద్దఎత్తున గుమిగూడిన ప్రజలకు చేతులు ఊపడం ప్రారంభించారు. అలా చేతులు ఊపటం థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలా మంది ప్రజలను ఆకర్షించింది. అదే సమయంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ తన వాహనానికి దారి కల్పించేందుకు ప్రజలను నెట్టడం ప్రారంభించింది. దీంతో అల్లు అర్జున్‌ను వెనక్కి తీసుకువెళ్లాలని అతని బృందానికి తెలియజేశాం. కానీ వారు దానిపై చర్య తీసుకోలేదు.


థియేటర్ లోపలకు అల్లు అర్జున్ వెళ్లి రెండు గంటలకు పైగా ఉన్నారు. దీంతో తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. అయినప్పటికీ తొక్కిసలాట జరిగింది. ఇందులో ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత కూడా వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్నాడు. అల్లు అర్జున్ చర్యలే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీశాయని స్పష్టమైంది. అరెస్ట్ సమయంలో అతని పట్ల పోలీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారనే మాట వాస్తవం కాదు. పోలీసులు అతని నివాసానికి చేరుకున్నప్పుడు, బట్టలు మార్చుకోవడానికి కొంత సమయం ఆయన కోరారు. తన పడకగదిలోకి వెళ్లినప్పుడు పోలీసు సిబ్బంది బయటే వేచి ఉన్నారు. అల్లు అర్జున్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. ఏ పోలీసు సిబ్బందీ అతనితో బలవంతంగా లేదా దురుసుగా ప్రవర్తించలేదు. అతని కుటుంబం, భార్యతో మాట్లాడేందుకు తగినంత సమయం ఇచ్చాం. బయటకు వచ్చిన అల్లు అర్జున్ స్వయంగా పోలీసు వాహనంలోకి ఎక్కారని" వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Allu Arjun Arrest,: అల్లు అర్జున్ కేసులో కొత్త ట్విస్ట్.. మృతురాలి భర్త ఏమన్నారంటే..

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే..

Updated Date - Dec 13 , 2024 | 09:47 PM