Hyderabad: ఆ విషయంపై తొలిసారి స్పందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
ABN , Publish Date - Dec 07 , 2024 | 08:24 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ వ్యయం దృష్ట్యా టికెట్ల ధరలు పెంచుకునేలా జీవో వచ్చేందుకు కారణమైన పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు.
హైదరాబాద్: పుష్ప-2 సినిమాకి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. పుష్ప-2 సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని తమ టీమ్‌కు సపోర్ట్ చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాణ వ్యయం దృష్ట్యా టికెట్ల ధరలు పెంచుకునేలా జీవో వచ్చేందుకు కారణమైన పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. "కల్యాణ్ బాబాయ్ థ్యాంక్స్" అంటూ అల్లు అర్జున్ చెప్పారు. పుష్ప సినిమాకు సపోర్టుగా నిలిచిన ప్రతి సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై ఐకాన్ స్టార్ స్పందించారు. తన అభిమాని రేవతి ప్రమాదవశాత్తూ మృతిచెందారని ఆరోజు తనకు తెలియదని, మరుసరి రోజు ఉదయం ఆ విషయం తెలిసినట్లు ఆయన చెప్పారు. రేవతి మృతి ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు.
ఆ ఘటన గురించి రెస్పాండ్ అయ్యేందుకు మాకు కొంచెం సమయం పట్టిందని అన్నారు. సినిమా టీమ్ ఎనర్జీ అంతా డౌన్ అయ్యిందని, అందరూ ఎంతో బాధపడ్డారని ఆయన చెప్పారు. తాము సినిమా చేసేది థియేటర్‌లో ప్రేక్షకులు ఆస్వాదించేందుకే అని, ఇలా జరుగుతుందని ఊహించలేదని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రేవతి కుటుంబం కొంచెం కొలుకున్న తర్వాత వారిని కలుస్తానని ఆయన చెప్పారు. రేవతి ప్రాణాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో బాధపడుతూ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijayawada: మహా కుంభాబిషేకంపై కీలక వ్యాఖ్యలు చేసిన యూపీ డిప్యూటీ సీఎం..
Hyderabad: తెలంగాణ తల్లి నూతన నమూనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రూపకర్తలు..
For More Andhra Pradesh News and Telugu News..