Metro Rail: మైట్రో సేవలకు అంతరాయం.. ప్రయాణికుల పరేషాన్
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:06 PM
గ్రేటర్ హైదరాబాద్‌లో మైట్రో రైలు (Metro Rail) సేవలకు కొంతసేపటి వరకు అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. మెట్రో రైల్లో సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ నిలిచిపోయింది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మైట్రో రైలు (Metro Rail) సేవలకు కొంతసేపటి వరకు అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. మెట్రో రైల్లో సాంకేతిక లోపంతో ఎర్రమంజిల్ స్టేషన్‌లో రైల్ నిలిచిపోయింది. ప్రయాణికులు బయటకు వెళ్లడానికి మెట్రో డోర్లను ఓపెన్ చేసే సమయంలో తెరచుకోలేదు. దీంతో ప్రయాణికులు కంగారు పడ్డారు.
మెట్రో తలుపులు తెరచుకోకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. రైల్లో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మియాపూర్ నుంచి LB నగర్ వైపు వస్తున్న మెట్రో రైల్లో ఈ అంతరాయం ఏర్పడింది. అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొంత సేపటి తర్వాత సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షంతో ప్రయాణికులతో మెట్రో స్టేష్టన్లు అన్నీ జనసంద్రంగా మారాయి.